ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడిన మాటల్లోని డబుల్ మీనింగ్ ఇదా..!

ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడిన మాటల్లోని డబుల్ మీనింగ్ ఇదా..!

తమిళనాడు రాజకీయాలు గరం గరంగా ఉన్నాయి. మాజీ మంత్రి, డీఎంకే యువ నేత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టుతో తమిళనాట పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందీ.. నేను అనలేదు కదా.. మీరు నా వాయిస్ వినండి.. అది బహిరంగ సభలో మాట్లాడిన మాటలు.. నాకు నేనుగా ఎలాంటి తప్పు మాట్లాడలేదు అంటూ చెప్పుకొస్తున్నారు ఉదయనిధి స్టాలిన్. 

ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్లోని డబుల్ మీనింగ్ ఇదంట.. !

కావేరీ నదీ జలాలపై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తుంది. కావేరీ నదీ నుంచి 5 టీఎంసీల నీళ్లు తమిళనాడుకు విడుదల చేయాలనే ఆదేశాలను పట్టించుకోకుండా.. కర్నాటక అడ్డుకుంటుంది. ఈ క్రమంలోనే తమిళనాడు తంజావూరులో డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో రైతు సభ పెట్టింది. ఈ సభకు ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. .

నీళ్ల గురించి మాట్లాడుతండగా.. సభలో కొందరు త్రిష.. త్రిష అంటూ కామెంట్ చేశారు.
దీనిపై స్పందిస్తూ.. 
ఎక్కడ నీళ్లు వచ్చినా రాకపోయినా అక్కడ మాత్రం రావాలి అన్నారు.. ఎక్కడ నీళ్లు పారినా పారకపోయినా అక్కడ మాత్రం పారాలి అంటూ ఆ కామెంట్లకు కొనసాగింపుగా కామెంట్ చేశారు. 

సీఎం విజయ్, త్రిష మధ్య ఉన్న సాన్నిహిత్యంపై సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఉన్న బంధం, అనుబంధంపై రకరకాల పుకార్లు ఉన్నాయి. గతంలో ఓ బీజేపీ నేత కామెంట్ చేయటం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉదయనిధి చేసిన కామెంట్లు డబుల్ మీనింగ్ అర్థానికి దారి తీశాయి. 

ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ కామెంట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. 
అధికార టీవీకే పార్టీ దీన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ అంటూ రెచ్చిపోయింది. వీళ్లకు మద్దతుగా అన్నట్లు కొంత మంది బీజేపీ మహిళా నేతలు దీన్ని ఖండించారు. 
ఈ క్రమంలోనే టీవీకే పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త కేసు పెట్టారు. FIR బుక్ చేసిన పోలీసులు.. ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేశారు. సీఎం విజయ్ ఉద్దేశాన్ని ముందుగానే పసిగట్టిన డీఎంకే పార్టీ.. స్టాలిన్ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. 
ఈ పిటీషన్ పై విచారణ ప్రారంభం కాకముందే.. చెన్నైలో ఉదయ్ నిధి స్టాలిన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.