VijayRashmika: విజయ్–రష్మిక ఎడడుగుల బంధం వెనుక ‘7’ సీక్రెట్.. అదేంటో తెలుసుకోండి.!

VijayRashmika: విజయ్–రష్మిక ఎడడుగుల బంధం వెనుక ‘7’ సీక్రెట్.. అదేంటో తెలుసుకోండి.!

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్స్ విజయ్-రష్మిక (VijayRashmika) గురువారం, ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఇప్పటికే కుటుంబసభ్యులతో కలిసి ఉదయ్‌పూర్‌కు చేరుకున్న ఈ జంట, అక్కడి లగ్జరీ వేదిక మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్’ Mementos by ITC Hotelsను డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఎంపిక చేసుకున్నారు.

వివాహ వేడుకలు ఇవాళ మంగళవారం (ఫిబ్రవరి 24న) మెహందీ కార్యక్రమంతో ప్రారంభం కానుండగా, బుధవారం (ఫిబ్రవరి 25) హల్దీ మరియు సంగీత్ వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ జంట తమ చిరకాల ప్రేమను వివాహ బంధంగా మార్చుకుంటూ ఈ జంట కొత్త జీవితాన్ని ఆరంభించనుంది. ఈ క్రమంలోనే, విజయ్, రష్మిక మధ్య వయస్సు తేడా ఎంతనేది తెలుసుకోవడానికి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. 

విజయ్–రష్మిక మధ్య వయస్సు తేడా ఎంత?

టాలీవుడ్‌లో అభిమానుల మనసులు గెలుచుకున్న జంటల్లో రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ ముందువరుసలో నిలుస్తారు. ఇన్నాళ్లు రూమర్స్ లవర్స్గా చెలామణిలో ఉన్న జంట, ఇప్పుడు పెళ్లివార్తతో మరోసారి వార్తల్లో నిలిచారు.

అయితే, వీరిద్దరి మధ్య సుమారు 7 ఏళ్ల వయస్సు తేడా ఉంది. రష్మిక మందన్న ఏప్రిల్ 5, 1996న కర్ణాటకలోని విరాజ్‌పేటలో జన్మించగా, ప్రస్తుతం ఆమె వయస్సు 29 సంవత్సరాలు. మరోవైపు విజయ్ దేవరకొండ మే 9, 1989న హైదరాబాద్‌లో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 36 సంవత్సరాలు. ఈ విధంగా 7 ఏళ్ల వయస్సు తేడాతో ‘విరోష్’గా అభిమానులు పిలిచే ఈ జంట, ఇప్పుడు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ఆరంభించనుంది. 

విజయ్–రష్మిక ప్రేమకథ ఎలా మొదలైంది?

2018లో తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్, రష్మిక తొలిసారి కలిసి నటించారు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత 2019లో ‘డియర్ కామ్రేడ్‌‌‌‌’తో వీరి బంధం మరింత బలపడింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ డేటింగ్‌‌‌‌లో ఉన్నారంటూ పలుమార్లు వార్తలొచ్చాయి. అలా వెకేషన్‌‌‌‌కు కలిసి వెళ్లడం, ఇద్దరి ఫొటోస్‌‌‌‌లోనూ ఒకే లొకేషన్‌‌‌‌ కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఈ క్రమంలోనే అన్నీ రూమర్స్కి చెక్ పెట్టి, అధికార ప్రకటన ఇచ్చేసి గురువారం ఫిబ్రవరి 26న ఒక్కటవ్వనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో అరవళ్ల కొండల మధ్య ఉన్న ‘ది మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్’ (ITC Mementos Udaipur) లో వివాహ వేడుకలు జరగనున్నాయి. అసలు ఆసక్తికర విషయం ఏంటంటే.. విజయ్–రష్మికల పెళ్ళికి ఏడడుగులు, ప్రేమకి ఏడేళ్లు.. వాళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఏడేళ్లు. అలా విజయ్ రష్మికల బంధం వెనుక ‘7’ నెంబర్ చాలా కీలకంగా మారింది.  

‘విరోష్’ పెళ్లి ప్రకటన:

ఆదివారం (ఫిబ్రవరి 22న) ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ జంట తమ పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు. గురువారం ఫిబ్రవరి 26న తమ పెళ్లి జరగనున్నట్లు స్పెషల్ నోట్తో తమ అనుబంధాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా తమ వివాహానికి “ది వెడ్డింగ్ ఆఫ్ VIROSH” అని పేరు పెట్టి అభిమానుల్లో మరింత ప్రేమను సంపాదించుకున్నారు. అలాగే, అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

“మా ప్రియమైనవారికి.. మేము ఈ నిర్ణయం తీసుకునే ముందే, మీరు మాతో ఉన్నారు. మీరు ప్రేమతో మాకు ‘VIROSH’ అనే పేరు ఇచ్చారు. అందుకే మా కలయికకు ‘ది వెడ్డింగ్ ఆఫ్ ‘VIROSH’ అని పేరు పెడుతున్నాం. మీ ప్రేమ ఎప్పటికీ మాలో భాగమే.” అని తెలిపారు. 

వివాహ వేడుక & రిసెప్షన్

ఉదయపూర్‌లో జరిగే పెళ్లి అనంతరం, మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. .  తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, ఆహ్వానాలు కూడా అందాయి.