Kavitha-KTR Row: వాట్ నెక్స్ట్.. కవితను బుజ్జగిస్తారా.. లేదంటే మందలిస్తారా..?

Kavitha-KTR Row: వాట్ నెక్స్ట్.. కవితను బుజ్జగిస్తారా.. లేదంటే మందలిస్తారా..?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ఆ పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు చేరింది. ఆమె రాసిన లేఖ... ఆ తర్వాత ఎయిర్​పోర్టు వద్ద చేసిన వ్యాఖ్యలు.. తదనంతర పరిణామాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కవిత ఎపిసోడ్పై ఇప్పటివరకూ పార్టీ పెద్దలెవరూ నేరుగా స్పందించలేదు. మీడియా సమావేశంలో కేటీఆర్ రెండు మూడు ముక్కలు మాట్లాడినా.. కవిత పేరెత్తలేదు.

ఈ క్రమంలోనే కవితతోనే కేసీఆర్ నేరుగా మాట్లాడే అవకాశాలున్నాయని బీఆర్ఎఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఆమెను బుజ్జగిస్తారా.. లేదంటే మందలిస్తారా.. అన్నదానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కవిత, కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. కేసీఆర్ను కవిత కలిసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరిగింది. కానీ, ఫామ్ హౌస్కు కేటీఆర్ వెళ్లి ఆ ఎపిసోడ్పై కేసీఆర్తో చర్చించారు. మరోవైపు పలువురు నేతలు కవిత అంశంపై స్పందిస్తూ.. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పారు.

కవిత అంశంతో పాటు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా కేసీఆర్, కేటీఆర్ చర్చించుకున్నట్లు సమాచారం. అమెరికాలో నిర్వహించనున్న బీఆర్ ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల అంశమూ చర్చకు వచ్చినట్టు తెలిసింది. జూన్ 1న నిర్వహించనున్న వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 28న కేటీఆర్అక్కడికి వెళ్లనున్నారు.

అక్కడ కేటీఆర్ మాట్లాడాల్సిన అంశాలపై, సభ తర్వాత ప్రవాసులతో నిర్వహించాల్సిన భేటీల గురించి కూడా కేసీఆర్ పలు సూచనలు చేశారని సమాచారం. జూన్ 2న తెలంగాణభవన్​ లో  రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని ఆయన సూచించినట్టు తెలిసింది.