హైదరాబాద్లో మిలాద్ ఉన్ నబీ జూలూస్ ఎప్పుడంటే..

హైదరాబాద్లో మిలాద్ ఉన్ నబీ జూలూస్ ఎప్పుడంటే..
  • ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి: సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా
  • డీజేలకు నో పర్మినేషన్

ఎల్బీనగర్, వెలుగు: ఈ నెల14న జరిగే మిలాద్ ఉన -నబీ జూలూస్​ను​ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని ముస్లిం సంఘాల నాయకులు, జూలూస్ కమిటీలు, యువకులు పోలీసులకు సహకరించాలని సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా  కోరారు. 

బుధవారం (సెప్టెంబర్ 10) పురానీ హవేలీలోని సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో మర్కజి మిలాద్ జూలూస్ కమిటీ సభ్యులతో ఆమె పీస్​మీటింగ్​నిర్వహించారు. జూలూస్​ను స్నేహం, సౌభ్రాతృత్వం, శాంతి, ఐక్యతకు ప్రతీకగా నిర్వహించాలని సూచించారు. మక్కా మసీదు వద్ద జరిగే ప్రధాన ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని, శబ్ద కాలుష్య చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

బైక్ స్టంట్స్, శబ్దం కలిగించే సైలెన్సర్లు వాడితే సీజ్​చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్​కు ఇబ్బంది కలగకుండా కేటాయించిన మార్గంలోనే ఊరేగింపు నిర్వహించాలని, వాలంటీర్లను నియమించి ర్యాలీని పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్బంగా వాలంటీర్లకు టీ-షర్టులు, క్యాప్​లు అందజేశారు.