V6 News

అధికారంలోకి రాగానే.. 317ను జీవోను రద్దు చేస్తాం

అధికారంలోకి రాగానే.. 317ను జీవోను రద్దు చేస్తాం
  • గెలిస్తే 317ను జీవోను రద్దు చేస్తాం
  • 317 జీవోతో ఉద్యోగ సంఘాలను వేరు చేసే కుట్ర 

హైదరాబాద్ :  తల్లి బిడ్డలను, భార్యాభర్తను వేరుచేసేలా తెలంగాణ ప్రభుత్వం జీవోను తీసుకువచ్చిందని సీరియస్ అయ్యారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి జీఓ.317 బాధిత ఉపాధ్యాయులు ఓయూలోని దూరవిద్యా కేంద్రం ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సీతక్క. స్థానికత కోసమే తెచ్చుకున్న తెలంగాణలో జీఓ 317 ను తీసుకు వచ్చి ఉద్యోగులకు స్థానికత లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు.

సీనియర్, జూనియర్ అంటూ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టి, ఉద్యోగ సంఘాలను వేరు చేసే కుట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తెలిపారు.  ఈ జీఓ తేవడం వల్ల 25 మంది ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ఈ సమస్యపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జీఓ 317ను రద్దు చేస్తామని తెలిపారు.