సమోసా క్యాపిటల్ అని ఏ సిటీని అంటారో తెలుసా! అక్కడ దొరికే వెరైటీలు ఎక్కడా చూసి ఉండరు

సమోసా క్యాపిటల్ అని ఏ సిటీని అంటారో తెలుసా! అక్కడ దొరికే వెరైటీలు ఎక్కడా చూసి ఉండరు

ఇండియాలో ఎక్కువ మందికి ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉందా అంటే అది సమోసా అనే చెప్పొచ్చు. టీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు ఎక్కడికెళ్లినా ఈ ఐటమ్ దొరుకని ప్లేస్ అంటూ ఉండదు. లో కాస్ట్ లో.. ఆకలేస్తేందన్నా.. ఏదైనా స్నాక్స్ తినాలనిపించినా.. చాలా మందికి ఆప్షన్ సమోసా. నార్త్ నుంచి సౌత్ వరకు ఇండియాలో ఎక్కడికెళ్లినా దొరికే ఈ ఫుడ్ ఐటమ్. 

అయితే సమోసా క్యాపిటల్ అని ఒక సిటీని అంటారు తెలుసా..? అక్కడ దొరికే వెరైటీలు మరెక్కడా దొరకవు. మరో విషయం ఏంటంటే.. ఆ టేస్టీ కూడా వేరే చోట రాదట. అందుకే లైఫ్ లో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి రుచి చాడాలి అంటుంటారు. ఆ సిటీ ఏంటో.. ఆ వెరైటీల ముచ్చటేంటో తెలుసుకుందాం. 

ఫుడ్ కల్చర్ లో.. రాజధాని నగరం ఢిల్లీ చాలా ఫేమస్. స్నాక్స్ అంటే ఢిల్లీలోనే అనేంతలా ఇక్కడ వీధుల్లో ఫుడ్ దొరుకుతుంది. ఎల్లప్పుడూ బిజీగా ఉండే చాందినీ చౌక్ సమీపంలో ఉండే వీధుల్లో.. స్వీట్ షాపులు, కాలేజ్ క్యాంటీన్లలో ఎక్కడ చూసినా సమోసాలు దొరుకుతుంటాయి. క్విక్ బ్రేక్ ఫాస్ట్ కింద, ఆవినింగ్ స్నాక్స్ కింద వీటిని తీసుకుంటారు. అదే కాకుండా ఏదైనా సెలబ్రేషన్స్ టైమ్ లో కూడా ఫెస్టివ్ ట్రీట్ కింద సమోసాలను ప్రెఫర్ చేస్తుంటారు. 

ఢిల్లీ సమోసాలకు క్యాపిటల్ కావడానికి కారణం.. అక్కడ దొరికె వెరైటీలు. సంప్రదాయకంగా వస్తున్నవి.. ప్రయోగాత్మకంగా తయారు చేసినవి.. యూనిక్ ఐడెంటిటీతో చాలా మందికి ఫేవరేట్ గా మారిపోతుంటాయి. 


ఢిల్లీలో ఫేమస్ సమోసాలు: 

  • సాంప్రదాయ ఆలూ సమోసాలు, 
  • పంజాబీ పెద్ద సమోసాలు, 
  • పనీర్ సమోసాలు, 
  • మటర్ సమోసాలు, 
  • కీమా సమోసాలు, డ్రై ఫ్రూట్ సమోసాలు, 
  • మినీ కాక్‌టెయిల్ సమోసాలు, 
  • కార్న్ అండ్ చీజ్ సమోసాలు, 
  • చౌమీన్ సమోసాలు,
  •  పిజ్జా అండ్ పాస్తా సమోసాలు, 
  • చాక్లెట్ సమోసాలు. 

ఇన్ని విభిన్నమైన సాంప్రదాయ, ఆధునిక రుచుల మిశ్రమమే ఢిల్లీ సమోసా సంస్కృతిని అభివృద్ధి చెందేలా చేస్తుందని చెప్పవచ్చు.

ఎందుకు ఢిల్లీ సమోసాలు స్పెషల్:

ఢిల్లీ స్టైల్ సమోసాలు ఘాటైన రుచులు, కరకరలాడే స్వభావంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వివిధ రకాల కూరలతో చేయడం ప్రసిద్ధి. ఇతర ప్రాంతాలలో లభించే సాధారణ రకాలలా కాకుండా, ఇవి మరింత ఘాటుగా, కారంగా, రుచికరంగా ఉంటాయి, అందుకే ఇవి ప్రత్యేకంగా సంతృప్తినిస్తాయి.

►ALSO READ | ఇల్లే ప్రయోగశాల.. బెల్లం అంటే ఇష్టమే.. కంపెనీ పెట్టేలా చేసింది.. ఇప్పుడు ఏ స్టోర్లో చూసినా..

వాటి ప్రత్యేకతలు ఇవే: 

పొరలు పొరలుగా ఉండే బంగారు రంగు పైపొర, కారంగా ఉండే బంగాళదుంప మసాలా కూర, పంజాబీ శైలి మసాలాలు, పుల్లని పుదీనా, చింతపండు చట్నీలు, కడుపు నింపేంత పరిమాణంలో ఉండటం స్పెషల్. చూడటానికి కనులకు ఇంపుగా ఉంటూ.. తినటానికి రుచిగా ఉండేలా చేయడమే ఢిల్లీ చెఫ్ ల స్పెషాలిటీ. బయటి పొర కరకరలాడుతూ ఉండగా, లోపలి కూర మంచి మసాలాలతో ఘాటుగా ఉండి, ప్రతి ముద్ద సంపూర్ణంగా, సంతృప్తిగా ఉంటుంది. 

ఢిల్లీ ఎందుకు సమోసాల్లో టాప్..

లక్నో, ఇండోర్, జైపూర్ వంటి నగరాలు కూడా వాటి సమోసాలకు, బలమైన వీధి ఆహార సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ .. ఢిల్లీలో ఉండే వెరైటీలు.. కొత్త రుచి, ప్రయోగాలతో ఇక్కడి సమోసాలు స్పెషల్ గా నిలుస్తున్నాయి.