'విచ్ మామ్ ఆర్ యూ' : నటి సమీరా రెడ్డి రీల్ వైరల్

'విచ్ మామ్ ఆర్ యూ' : నటి సమీరా రెడ్డి రీల్ వైరల్

సోషల్ మీడియాలో సెకనుకో వీడియో వైరల్ అవుతోంది. ఇక సెలబ్రెటీలకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ లేదా వీడియో వచ్చిందంటే చాలు.. పోస్ట్ చేసిన నిమిషాల్లోనే లక్షల్లో లైకులు, వ్యూస్ రావడం చూస్తూనే ఉంటాం. అదే తరహాలో నటి సమీరా రెడ్డి చేసిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఒక తల్లి తన జీవిత కాలంలో ఎన్ని రకాల పాత్రలు పోషిస్తుందో తెలియజేస్తూ.. ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో (పిల్లలను, ఫ్యామిలీని చూసుకుంటూ అలసిపోయిన మమ్మీ) టయర్డ్ మామ్, ది జిమ్ మామ్, ది హై ఫ్యాషన్ మామ్, ది ఇన్ ఫ్లూయెన్సర్ మామ్, ది ప్లీజ్ డోన్ట్ టాక్ టు మీ మామ్ (దయచేసి నాతో మాట్లాడొద్దు అమ్మా) అంటూ కొన్ని ఎక్స్ ప్రెషన్స్, వేరియేషన్స్ ఉన్నాయి. ఇక ఈ వీడియోతో పాటు మీరు ఇందులో ఏ రకమైన మదర్ అని ప్రశ్నించిన సమీరా.. తానైతే ఖచ్చితంగా మొదటి రకానికి చెందిన మమ్మీనే అని ఓ స్మైల్ ఎమోజీని జోడించారు.

ఇక సమీరా రెడ్డి షేర్ చేసిన ఈ వీడియోకు మొదటి మూడు గంటల్లోనే 6 లక్షల వ్యూస్, 50వేలకు పైగా లైకులు వచ్చాయి. ఇదిలా ఉండగా సమీరా రెడ్డి 2014లో ప్రముఖ వ్యాపార వేత్త అక్షయ్ వర్దేను మహారాష్ట్ర సంప్రదాయంలో వివాహమాడారు. అనంతరం 2015లో హన్స్ వార్దే, 2019లో నైరా అనే పిల్లలకు జన్మనిచ్చిన సమీరా.. చివరిసారిగా 2013లో కన్నడ చిత్రం వరధనాయకలో కనిపించారు.