హైదరాబాద్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని రైతులు.. అధికారం పోయాక గుర్తొచ్చారా అని విప్విజయరమణారావు బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయనకు లేఖ రాశారు. ‘ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని, మీ మాదిరిగా మద్దతు ధర అడిగిన రైతులకు మేము బేడీలు వేయించలేదని’ పేర్కొన్నారు. బీఆర్ఎస్హయాంలో ఎంత ధాన్యం కొనుగోలు చేశారో.. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో ఎంత కొనుగోలు చేశామో.. ఒకసారి తెలుసుకోవాలని సూచించారు.
