
పాట్నా.:అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ లో ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కూటమి సమరానికి సిద్దమవుతోంది. గురువారం ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను ఇండియా బ్లాక్ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అదే సమయంలో వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) చీఫ్ ముఖేష్ సహానిని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసింది.
ఈ ప్రకటనతో బీహార్‌లో ఎన్నికల సమరానికి ప్రతిపక్షం సిద్ధమవుతోంది. వీరి ఎంపిక ద్వారా బీహార్ లో అన్ని వర్గాల ప్రజలకు ప్రతినిధ్యం వహించే నేతలను బరిలోకి దించుతున్నట్లు సంకేతాలు పంపింది. తేజస్వి యాదవ్ అభ్యర్థిత్వం ఆర్జేడీ, మిత్రపక్షాల శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. మొదట ఇండియాకూటమితో విభేదించిన ముఖేష్ సహాని మనసు మార్చుకుని కూటమితో చేతులు కలపడంతో ఆయనకు డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.
మల్లా కుమారుడిగా ఫేమస్ అయిన ముఖేష్ సహానీ.. వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్. సంకీర్ణంలో తనకు తగిన చోటు లభించలేదని ఈ ఏడాది ప్రారంభంలో కూటమినుంచి బయటికి వెళ్లారు. అధిష్టానం ముఖ్య నేతల జోక్యంతో మళ్లి ఇండియా కూటమితో చేతులు కలపడంతో డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది ఇండియా కూటమి.
ఎవరీ ముఖేష్ సహాని..?
సినిమాలు ,టీవీ షోలకు సెట్‌లు వేస్తూ షో బిజినెస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన ముఖేష్ సహాని.. ముఖేష్ సినీవరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. తర్వాత నితిన్ దేశాయ్, ఉమాంగ్ కుమార్లతో ఏర్పడిన పరిచయం బిజినెస్ పార్టినర్ షిప్ వరకు వెళ్లింది. షారూఖ్ ఖాన్ నటించిన దేవదాస్ సెట్స్ వేసింది ఇతనే.
బిగ్ బాస్ టీవీ షో కోసం ,సల్మాన్ ఖాన్ హీరోగా సూరజ్ బర్జాత్య చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయో కోసం సెట్లు నిర్మించడంలో ముఖేష్ సహాని కీరోల్ ఉంది.
బిలియనీర్ ముఖేష్ అంబానీ కోసం డిజైనర్ సందీప్ ఖోస్లా ఏర్పాటు చేసిన షోకు కూడా పనిచేశాడు ముఖేష్ సహాని. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ (విఐపీ) పెట్టాడు. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే ఇండియా కూటమి తరపున బీహార్ డిప్యూటీ సీఎం బరిలో ఉన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు..
122 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండుదఫాలుగా జరగనున్నాయి. నవంబర్ 6 న మొదటి దశ, నవంబర్ 11న చివరి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.