బిగ్ బాస్3 టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచేదెవరు.?

బిగ్ బాస్3 టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచేదెవరు.?

‘బిగ్‌‌‌‌‌‌‌‌బాస్‌‌‌‌‌‌‌‌–3’ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరింది. ఈ వారం శివజ్యోతి ఎలిమినేట్ కాగా, మిగిలిన ఐదుగురు ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. శ్రీముఖి, వరుణ్​ సందేశ్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌ సిప్లిగంజ్‌‌‌‌‌‌‌‌, బాబా భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అలీ రెజా టైటిల్‌‌‌‌‌‌‌‌ కోసం పోటీపడుతున్నారు. వీళ్లలో చివరకు టాప్‌‌‌‌‌‌‌‌–3లో నిలిచిన వారిలోంచి ఒకరిని విజేతగా ఎంపిక చేస్తారు. ఫైనల్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు ఓటింగ్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంది. అయిదుగురిలోంచి ఎవరు టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలుస్తారని ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరో మూడు రోజుల్లో ‘బిగ్‌‌‌‌‌‌‌‌బాస్‌‌‌‌‌‌‌‌–3’ టైటిల్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరో తెలిసిపోనుంది. హోస్ట్‌‌‌‌‌‌‌‌గా నాగార్జున ఈ షోను సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా నడిపిస్తున్నాడు. కంటెస్టెంట్లు కూడా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను బాగానే ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. మధ్యలో కొన్ని ఎపిసోడ్లు అంతగా ఆకట్టుకోకపోయినా, ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌ చేసింది ఈ షో. ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరిన కంటెస్టెంట్లకు మద్దతుగా సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఒకరి ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ మరొక కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ట్రోల్స్‌‌‌‌‌‌‌‌ కూడా చేస్తూ, వాళ్ల ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో బిగ్‌‌‌‌‌‌‌‌బాస్‌‌‌‌‌‌‌‌ కంటెస్టెంట్ల విషయంలో ఫ్యాన్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడుస్తోంది. గతంలో ‘కౌశల్‌‌‌‌‌‌‌‌ ఆర్మీ’లాగే ఈ సారి కూడా అందరికీ ఆర్మీ (సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌)లు ఏర్పడ్డాయి. సినిమా హాళ్లలో యాడ్స్‌‌‌‌‌‌‌‌తో, హోర్డింగ్స్‌‌‌‌‌‌‌‌తో తమ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌ కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌కు ఓటేయమని ప్రచారం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరిన కంటెస్టెంట్ల నేపథ్యం గురించిన వివరాలివి.

శ్రీముఖి: బుల్లితెరపై టాప్‌‌‌‌‌‌‌‌ యాంకర్లలో ఒకరుగా కొనసాగుతోంది శ్రీముఖి. ‘పటాస్‌‌‌‌‌‌‌‌’ షో ద్వారా యూత్‌‌‌‌‌‌‌‌కు బాగా దగ్గరైంది. ముఖ్యంగా స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌లో శ్రీముఖికి ఎక్కువ ఫాలోయింగ్‌‌‌‌‌‌‌‌ ఉంది. గ్లామరస్‌‌‌‌‌‌‌‌ యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇమేజ్‌‌‌‌‌‌‌‌తోపాటు హౌజ్‌‌‌‌‌‌‌‌లో యాక్టివ్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌, యూత్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఫ్యాన్‌‌‌‌‌‌‌‌ ఫాలోయింగ్‌‌‌‌‌‌‌‌ ప్లస్‌‌‌‌‌‌‌‌గా మారాయి.

వరుణ్‌‌‌‌‌‌‌‌ సందేశ్‌‌‌‌‌‌‌‌: ‘హ్యాపీడేస్‌‌‌‌‌‌‌‌’ సినిమాతో పరిచయమైన వరుణ్​ సందేశ్‌‌‌‌‌‌‌‌ చాలా సినిమాల్లో హీరోగా చేసి మంచి ఇమేజ్‌‌‌‌‌‌‌‌ సంపాదించుకున్నాడు. కొంతకాలంగా సినిమాలు చేయకపోయినా ఈ షో ద్వారా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు మళ్లీ దగ్గరయ్యాడు. హౌజ్‌‌‌‌‌‌‌‌లో చాలా సాఫ్ట్‌‌‌‌‌‌‌‌ నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌గా పేరుంది. సినిమా హీరో ఇమేజే కాకుండా, హౌజ్‌‌‌‌‌‌‌‌లో కామ్‌‌‌‌‌‌‌‌గా, సెన్సిబుల్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఇమేజ్‌‌‌‌‌‌‌‌ కూడా వరుణ్‌‌‌‌‌‌‌‌కు ఉపయోగపడుతోంది.

రాహుల్‌‌‌‌‌‌‌‌: సింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్‌‌‌‌‌‌‌‌ సిప్లిగంజ్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌లో రోజురోజుకు ఇమేజ్‌‌‌‌‌‌‌‌ పెంచుకుంటూ పోయాడు. ముఖ్యంగా టాస్కుల్లో మంచి పోటీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. పునర్నవితో క్లోజ్‌‌‌‌‌‌‌‌ రిలేషన్‌‌‌‌‌‌‌‌షిప్ మెయింటైన్‌‌‌‌‌‌‌‌ చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నా, కొద్దిరోజుల్లోనే వాటిని దాటి మరింత స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌గా మారాడు.

బాబా భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన బాబా భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌లో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకున్నాడు. అందరితో సరదాగా ఉంటూ, హౌజ్‌‌‌‌‌‌‌‌మేట్స్‌‌‌‌‌‌‌‌కు మంచి వంటలు చేసి పెట్టే బాధ్యత తీసుకున్నాడు. మొదట్లో కాస్త బలహీనంగానే కనిపించినా, రానురాను స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌గా మారి, ఫైనల్‌‌‌‌‌‌‌‌ వరకు చేరాడు.

అలీ రెజా: మోడల్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన అలీ రెజా ముందు నుంచి స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌గానే ఉన్నాడు. అయితే ఎప్పుడూ అగ్రెసివ్‌‌‌‌‌‌‌‌గా ఉండటం అలీ రెజాకు మైనస్‌‌‌‌‌‌‌‌గా మారింది. అంతకుమించి ఒకసారి హౌజ్‌‌‌‌‌‌‌‌లోంచి ఎలిమినేట్‌‌‌‌‌‌‌‌ అయి తిరిగి రావడంపై ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌లో రెండు రకాల అభిప్రాయాలున్నాయి.

గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా ఫినాలె

చివరి వారానికి చేరుకోవడంతో ‘బిగ్‌‌‌‌‌‌‌‌బాస్‌‌‌‌‌‌‌‌’ను మరింత ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌గా మార్చేందుకు టీమ్‌‌‌‌‌‌‌‌ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా సోమవారం టాప్‌‌‌‌‌‌‌‌ యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుమను హౌజ్‌‌‌‌‌‌‌‌లోకి గెస్టుగా తీసుకొచ్చారు. ఆమె హౌజ్‌‌‌‌‌‌‌‌లో కంటెస్టెంట్లతో ఆడించిన సరదా గేమ్‌‌‌‌‌‌‌‌ నవ్వులు పూయించి, ఆకట్టుకుంది. ఫైనల్‌‌‌‌‌‌‌‌ వరకు ప్రతి ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌ను ఇంట్రెస్టింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంచాలనుకుంటున్నారు. ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌ను గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా సెలబ్రేట్‌‌‌‌‌‌‌‌ చేయనున్నట్లు సమాచారం. ఫైనల్‌‌‌‌‌‌‌‌ రోజు హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్‌‌‌‌‌‌‌‌ వంటి తారలతో స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ ఉండే అవకాశం ఉంది. చివరి రెండు రోజులు మరింత ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది.

మెగాస్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌?

సాధారణంగా ‘బిగ్‌‌‌‌‌‌‌‌బాస్‌‌‌‌‌‌‌‌’ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టైటిల్‌‌‌‌‌‌‌‌ అందించేందుకు ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్‌‌‌‌‌‌‌‌ను తీసుకొస్తారు. నాని హోస్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన గత సీజన్‌‌‌‌‌‌‌‌కు ‘విక్టరీ’ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌గా వచ్చి విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రోఫీ అందించాడు. అందుకే ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో కూడా మరో సెలబ్రిటీ గెస్ట్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చేందుకు బిగ్‌‌‌‌‌‌‌‌బాస్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం షోలో నాగార్జున హోస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు కాబట్టి, ఆయనలాగే మరో సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరో గెస్ట్‌‌‌‌‌‌‌‌గా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ‘మెగాస్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిరంజీవితో విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రోఫీ అందించే అవకాశాలున్నాయట.

Read more