నవంబర్ 4 నుంచే దళితబంధు అమలు చేస్తానన్న కేసీఆర్ ఇప్పటి దాకా ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. దళితుల ఓట్ల కోసమే ఎన్నికల టైంలో స్కీం తీసుకొచ్చరన్నారు. దళితులపై కేసీఆర్ కు ప్రేమ లేదని విమర్శించారు. హైదరాబాద్ లో మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన ఆయన.. భూస్వాములకు రైతు బంధు ఎందుకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
