IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌ హోంగ్రౌండ్‌గా వైజాగ్ ఎందుకు.. కారణమిదే?

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌ హోంగ్రౌండ్‌గా వైజాగ్ ఎందుకు.. కారణమిదే?

అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ బీసీసీఐ ఐపీఎల్ -17వ సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. కొన్ని గంటల క్రితమే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. మొదటి 15 రోజుల షెడ్యూల్‌ (21 మ్యాచ్‌లు)ను ప్రకటించింది. ఇందులో దాని స్వంత మైదానంలో మ్యాచ్‌లు ఆడని ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. వీరు తమ సొంత గ్రౌండ్‌ అరుణ్‌ జైట్లీ స్టేడియంలో కాకుండా వైజాగ్‌లో ఆడనున్నారు. అందుకు గల కారణమేంటనేది అభిమానులను వేధిస్తోన్న ప్రశ్న. 

తమ సొంత గ్రౌండ్‌‌ను కాదనుకున్నారంటే.. తెలుగు ప్రజల మీద బీసీసీఐకి, డిల్లీ పెద్దలకు ఎంత ప్రేమ అనుకోకండి. అసలు కారణం వేరే ఉంది. లేదంటే సొంత అభిమానులను కాదనుకొని వారెందుకు ఇంత దూరం వస్తారు. అరుణ్‌ జైట్లీ వేదికగా మార్చి 5 నుంచి 17 దాకా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) జరగనుంది. ఈ టోర్నీలో లీగ్‌ దశతో పాటు ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ కలిపి మొత్తం 12 మ్యాచ్‌లు అరుణ్‌ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా మ్యాచ్‌లు నిర్వహించడం వీలుకాదని డీడీసీఏ.. బీసీసీఐకి తెలియజేసింది. ఈ కారణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్‌లను వైజాగ్‌కు తరలించారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ షెడ్యూల్‌..

  • మార్చి 23 : పంజాబ్‌ వర్సెస్‌ ఢిల్లీ (మొహాలీ)
  • మార్చి 28 : రాజస్తాన్‌ వర్సెస్‌ ఢిల్లీ (జైపూర్‌)
  • మార్చి 31 : ఢిల్లీ వర్సెస్‌ చెన్నై (వైజాగ్‌)
  • ఏప్రిల్‌ 03 : ఢిల్లీ వర్సెస్‌ కోల్‌కతా (వైజాగ్‌)
  • ఏప్రిల్‌ 07 : ముంబై వర్సెస్‌ ఢిల్లీ (ముంబై)