ఉసిరితో ఉపయోగాలు తెలిస్తే..రోజూ తినేస్తారు

ఉసిరితో ఉపయోగాలు  తెలిస్తే..రోజూ తినేస్తారు

రోజువారి ఆహారంలో ఉసిరి పండును చేర్చుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఎల్లప్పుడూ తాజాగా ఉండే ఉసిరిని మన ఆహారంలో భాగం చేసుకుంటే మరీ మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరి రోగ నిరోధక శక్తికి అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి తో పాటు ఖనిజాల పుష్కలంగా ఉంటాయి.. ఈ మధ్య కాలంలో ఉసిరిని వాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పుష్కలంగా ఉంటుంది. ఉసిరి రసాన్ని పరగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఉసిరి రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ఉసిరి రసాన్ని పరగడుపున తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. కొవ్వును కరిగించడంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. 

టాక్సిన్స్ తొలగిస్తుంది

ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లను కూడా తొలగిస్తుంది. ఉసిరి రసం యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది. 

ఆమ్లా హెయిర్ ఫోలికల్స్‭ను బలోపేతం చేస్తుంది. ఇది జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. కుదుళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఉసిరిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రును నివారిస్తాయి.

చర్మ ఆరోగ్యంతో పాటు కంటికి మేలు

ఉసిరిలో ఉంటే విటమిన్ సి చర్మానికి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఒంట్లో ఉంటే టాక్సిన్స్ ను బయటికి పంపడం వల్ల చర్మం వృద్దాప్యం, ముడతలు రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే.. కంటి చూపును పెంచడంలో ఉసిరి చాలా మంచిది. ఇందులో ఉండే కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది.