ఫన్నీ వీడియో: జూమ్ కాల్ మీటింగ్‌లో ఉన్న భర్తను కిస్ చేయబోయిన భార్య

ఫన్నీ వీడియో: జూమ్ కాల్ మీటింగ్‌లో ఉన్న భర్తను కిస్ చేయబోయిన భార్య

ఆన్‌లైన్ జూమ్ కాల్ మీటింగ్‌లో ఉన్న భర్తను ఆయన భార్య కిస్ చేయబోయింది. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను బిజినెస్‌మెన్ హర్ష్ గోయెంకా తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ఆ వీడియోకు ఆయన ‘జూమ్ కాల్.. సో ఫన్నీ’ అంటూ ట్యాగ్ లైన్ చేశారు.

జూమ్ కాల్ మీటింగ్‌లో ఒక వ్యక్తి వివిధ విషయాల గురించి చర్చింస్తుండగా.. ఆయన భార్య గదిలోకి వచ్చింది. వెంటనే భర్తను ముద్దాడటానికి ప్రయత్నించింది. దాంతో షాకైన ఆ వ్యక్తి.. ల్యాప్‌టాప్ వైపు చూపించి.. తాను ఆన్‌లైన్ మీటింగ్‌లో ఉన్నానని సిగ్నల్ ఇచ్చాడు. దాంతో ఆమె ఒక చిరునవ్వు నవ్వి ఆయనకు వెనుకవైపు వెళ్తుంది. ఆ వ్యక్తి మాత్రం కొంత అసహనానికి గురై.. ‘వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ డూయింగ్.. కెమెరా ఈజ్ ఆన్’ అంటూ గునుగుతాడు.

హర్ష్ గోయెంకా ట్వీట్ చేసిన ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా కూడా రీట్వీట్ చేశారు. ఈ వీడియోను చూసిన ఆయన ‘హాహా.. నేను ఈ లేడీని వైఫ్ ఆఫ్ ది ఇయర్‌గా నామినేట్ చేస్తాను. ఈ ఊహించని ఘటన పట్ల భర్త సంతోషంగా రియాక్ట్ అయి ఉంటే.. వారిద్దరిని కపుల్ ఆఫ్ ది ఇయర్ కొరకు నామినేట్ చేసేవాడిని, కానీ అతను ఆ అవకాశాన్ని కోల్పోయాడని బాధగా ఉంది!’అని ట్యాగ్ చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 24 గంటలలోపే మూడు లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించి వైరల్ అయ్యింది. ఈ వీడియో పట్ల పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

యాంత్రిక జీవితానికి అలవాటుపడిన భర్తలకు ఇటువంటివి మధుర జ్ఞాపకాలు అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆ వయసులో కూడా ఇటువంటి చిన్న చిన్న సరదాలు వారి ప్రేమకు తీపి గుర్తులు. వారి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

For More News..

వ్యాక్సినేషన్ బార్.. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ

మార్స్‌పై సేఫ్‌గా దిగి ఫోటో పంపిన నాసా రోవర్