
సంస్కారం ఉన్న వ్యక్తి ఎవరైనా మోడీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు పెడతారా అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను ప్లాస్టిక్ రహిత నగరంగా చేస్తానన్న వ్యక్తి.. హైదరాబాద్ లో ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖను చెత్తబుట్టలో వేసుకోండి.. లేదంటే గాంధీ భవన్ ను ఆ పేపర్ లతో తుడుచుకోండి అంటూ కామెంట్స్ చేశారు.
ఇక ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘం నాయకులు, తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ ఆందోళన నిర్వహించారు. మోడీ తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టొద్దు అంటూ నిరసనకు దిగారు. నల్ల జెండాలతో ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ గో బ్యాగ్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.