డబ్బు కోసం 10 మంది భర్తలను అయినా మారుస్తా : పేదరికంలోకి మాత్రం వెళ్లనంటూ నటి షాకింగ్ కామెంట్స్..!

డబ్బు కోసం 10 మంది భర్తలను అయినా మారుస్తా : పేదరికంలోకి మాత్రం వెళ్లనంటూ నటి షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ డ్రామా క్వీన్ , కాంట్రవర్సీల కేరాఫ్ అడ్రస్ రాఖీ సావంత్ అంటే తెలియని వారుండరు. ఎప్పుడూ తన వింత ప్రవర్తనతో, హాట్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిస్తుంటుంది ఈ భామ.. లేటెస్ట్ గా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని మైండ్ బ్లోయింగ్ విషయాలను షేర్ చేసుకుంది. డబ్బు, అందం, పెళ్లిళ్లపై రాఖీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

'డబ్బు బెడ్డు'పై పడుకుంటా!

మీకు ఎంత సంపాదించాలని ఉందన్న ప్రశ్నకు రాఖీ తనదైన శైలిలో బదులిచ్చింది. నాకు నోట్ల కట్టల బెడ్డుపై పడుకునేంత డబ్బు సంపాదించాలని ఉంది అంటూ ఓపెన్ అయిపోయింది. నాకున్న ఈ అందం, మేకప్, లగ్జరీ లైఫ్  వెనుక లక్షల రూపాయల ఖర్చు ఉంది. నా తలపైన ఉన్న ఈ రష్యన్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ కోసం ఒక్కోసారికి రూ.12 లక్షలు ఖర్చవుతుంది. ఇది దుబాయ్, లండన్, కెనడాలో చేయించుకుంటా. నా నెయిల్స్, ఐలాషెస్ కోసం ఆఫ్రికా వరకు వెళ్తాను. ఈ జాలైన్, లిప్స్, నోస్.. అంతా పైసల మహిమే అంటూ తన కాస్మోటిక్ సర్జరీల సీక్రెట్లను బయటపెట్టింది.

10 మంది మొగుళ్లనైనా మారుస్తా కానీ..

రాఖీ సావంత్ గతంలో రితేష్, ఆదిల్ ఖాన్ దుర్రానిలను పెళ్లాడి.. ఆ తర్వాత వారితో గొడవలు పడి విడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. నాకు పేదరికం అంటేనే అసహ్యం. మళ్లీ ఆ కష్టాల్లోకి వెళ్లడానికి నేను సిద్ధంగా లేను. ఒకవేళ నా ఆర్థిక పరిస్థితి కోసం, పేదరికం నుండి తప్పించుకోవడం కోసం 10 మంది మొగుళ్లనైనా మారుస్తానే తప్ప.. మళ్లీ పేదరికంలోకి మాత్రం వెళ్లను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

నా డిప్రెషన్‌కు మందు 'మనీ' మాత్రమే..

నాకు డిప్రెషన్ వస్తే వాడే టాబ్లెట్లు ఏంటో తెలుసా? 'మనీ-టాన్', 'మనీ సింగ్', 'మనీ-సెటమాల్'. నా దగ్గర ఈ మూడు మెడిసిన్స్ ఉంటే చాలు.. నా డిప్రెషన్ క్షణాల్లో గాయబ్ అవుతుంది. అసలు డబ్బు లేని జీవితం ఒక జీవితమేనా?" అని రాఖీ ప్రశ్నించింది.

ఆ కష్టాలే రాఖీని ఇలా మార్చాయా?

అయితే రాఖీ సావంత్ మాటలు వినడానికి క్రేజీగా, కాంట్రవర్సీగా అనిపించినా.. ఆమె గతాన్ని చూస్తే ఆ పెయిన్ అర్థమవుతుంది. గతంలో రాఖీ తల్లి క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు వైద్య ఖర్చుల కోసం బిగ్‌బాస్ 14 లో రూ14 లక్షల క్యాష్ ప్రైజ్ తీసుకుని షో నుండి తప్పుకుంది. అప్పట్లో సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్‌లు ఆమెకు అండగా నిలిచారు. ఇటీవల 2024 లో రాఖీ గర్భాశయ ట్యూమర్ సర్జరీ చేయించుకున్నప్పుడు కూడా సల్మాన్ ఖాన్ ఆర్థికంగా సాయం చేశారు. బతుకుదెరువు కోసం, కుటుంబ బాధ్యతల కోసం ఇలా బోల్డ్ క్యారెక్టర్‌గా మారాల్సి వచ్చింది. అందుకే లైఫ్‌లో 'మనీ' ఇంపార్టెన్స్ ఏంటో తనకు బాగా తెలుసని, అందుకే బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, క్లబ్ ఈవెంట్స్ చేస్తూ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానని అంటోంది ఈ కాంట్రవర్సీ క్వీన్..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)