పద్మారావునగర్, వెలుగు: బస్తీల్లో మౌలిక వసతులు కల్పించి ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. సోమవారం ఆయన మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ లోని అరవ బస్తీ, జూలమ్మ, తుర్కలమ్మ దేవాలయాల ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ విభాగాల అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మరో 20 ఏళ్ల పాటు ఇబ్బందులు లేకుండా అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు.
