ఆప్ బాటలోనే కాంగ్రెస్ 

ఆప్ బాటలోనే కాంగ్రెస్ 
  • గుజరాత్​లో మేం పవర్​లోకి వస్తే.. ఓల్డ్ పెన్షన్ స్కీం మళ్లీ తెస్తాం
  • ఓటర్లకు ఆప్, కాంగ్రెస్ హామీ
  • ఇటీవల పాత పెన్షన్ స్కీం కోసం రాష్ట్రంలో నిరసనలు 
  • అసెంబ్లీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకున్న అపొజిషన్ పార్టీలు    

వడోదర/న్యూఢిల్లీ: గుజరాత్​లో తాము అధికారంలోకి వస్తే సర్కార్ ఉద్యోగులకు న్యూ పెన్షన్ స్కీంను ఎత్తేసి ఓల్డ్ పెన్షన్ స్కీంను మళ్లీ తెస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ ప్రకటించాయి. ఓల్డ్ పెన్షన్ స్కీంను మళ్లీ తేవాలంటూ ఇటీవల రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఈ స్కీం అంశాన్నే ఆప్, కాంగ్రెస్ రెండూ ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి. గుజరాత్ లో వచ్చే డిసెంబర్ లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా మంగళవారం వడోదరలో జరిగిన టౌన్ హాల్ మీటింగ్ లో కేజ్రీవాల్ మాట్లాడారు. పంజాబ్​లో ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేస్తున్నామని, గుజరాత్ లో గెలిస్తే ఇక్కడా అమలు చేస్తామని ప్రకటించారు.    

ఆప్ బాటలోనే కాంగ్రెస్ 

గుజరాత్​లో అధికారంలోకి వస్తే పాత విధానాన్నే కొనసాగిస్తామని కాంగ్రెస్ కూడా ప్రకటించింది. మంగళవారం ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ మేరకు ట్వీట్ చేశారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఓపీఎస్​ను తెచ్చామన్నారు.