సెమీస్‌‌‌‌లో మరో నలుగురు బాక్సర్లు

సెమీస్‌‌‌‌లో మరో నలుగురు బాక్సర్లు

ఆస్తానా (కజకిస్తాన్‌‌‌‌): ఏఎస్‌‌‌‌బీసీ ఆసియా అండర్‌‌‌‌–22, యూత్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియాకు చెందిన మరో నలుగురు బాక్సర్లు పతకాలు ఖాయం చేసుకున్నారు. 51 కేజీ క్వార్టర్స్‌‌‌‌లో మాండెంగ్‌‌‌‌బామ్‌‌‌‌ జాదుమణి సింగ్‌‌‌‌ 5–0తో పుంతుషో కిన్లీ (భూటాన్‌‌‌‌)పై, 57 కేజీల్లో నిఖిల్‌‌‌‌ 4–0తో భక్తియోరోవ్‌‌‌‌ ఆయూబ్‌‌‌‌ఖాన్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌)పై గెలిచి సెమీస్‌‌‌‌లోకి అడుగుపెట్టారు. 63.5 కేజీల్లో అజయ్‌‌‌‌, 71 కేజీల్లో అంకూష్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌సీ ద్వారా విజయాలు సాధించారు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌‌‌‌లో అజయ్‌‌‌‌.. దామిండోర్జ్‌‌‌‌ (మంగోలియా)పై, అంకూష్‌‌‌‌.. లీ జు సాంగ్‌‌‌‌ (కొరియా)పై గెలిచారు.