
ముంబై: టీ20 వరల్డ్ కప్‌కు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడంపై వస్తున్న విమర్శలపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. హార్దిక్ ఫిట్‌గా ఉంటే అతనికి సరితూగే ప్రత్యామ్నాయం లేదని చెప్పాడు. ‘పాండ్యా రాకతో టీమ్‌లో బ్యాలెన్స్ పెరుగుతుంది. వైస్ కెప్టెన్సీ గురించి చర్చించలేదు. ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ మెరుగ్గానే ఆడుతున్నాడు. మెగా టోర్నీకి ఇంకా టైమ్ ఉంది కాబట్టి అప్పటివరకు మరింత ఫామ్‌ను సాధిస్తాడు. పాండ్యా సరైన ఫిట్‌నెస్‌తో ఉంటే అతనికి సరిపోయే ప్రత్యామ్నాయ ప్లేయర్ ఉండడు’ అని అగార్కర్ పేర్కొన్నాడు. రింకూ సింగ్‌ను పక్కనబెట్టడం అనేది తాము తీసుకున్న అతి కష్టమైన నిర్ణయమన్నాడు.