జైపూర్, వెలుగు: యాక్సిడెంట్ లో మంచిర్యాలలోని కమర్షియల్ టాక్స్ ఆఫీసులో లో పని చేస్తున్న సీనియర్ ఇన్స్పెక్టర్అలపురి అనురాగ్ (35) చనిపోయినట్లు ఎస్ఐ రాజశేఖర్ పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం.. సీసీసీ నస్పూర్ కు చెందిన అనురాగ్ మంచిర్యాలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసులో లో సీనియర్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద విధులు నిర్వహిస్తుండగా గోదావరిఖని వైపు నుంచి వస్తున్న అనుపం కుమార్ కు చెందిన మారుతి సుజీకీ కారు అదుపు తప్పి అక్కడున్న అనురాగ్ ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై స్పాట్ లో చనిపోయాడు.
మృతుడి తల్లి అలపురి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
అనురాగ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మంచిర్యాల: డ్యూటీలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సీనియర్ ఇన్స్పెక్టర్అనురాగ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి డిమాండ్ చేశారు. ఆయన జిల్లా టీఎన్జీవో నాయకులతో కలిసి అనురాగ్ కుటుంబాన్ని పరామర్శించి మృతదేహానికి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ పై జరిగిన ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లు ప్రభుత్వం అనురాగ్ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట టీఎన్జీవో కమిటీ సభ్యులు ఉన్నారు.
