కల్తీ వస్తువుల సంస్థల భరతం పడతాం : దుబ్బ నీరజ

కల్తీ వస్తువుల సంస్థల భరతం పడతాం : దుబ్బ నీరజ
  • మోసపోతే 88970 86608 నంబర్​కు సమాచారం ఇవ్వండి 
  • భారతీయ సోషిత్ సేన కన్స్యూమర్ ఫోరం

పంజాగుట్ట, వెలుగు: నిత్యావసర వస్తువుల కల్తీకి పాల్పడుతున్న సంస్థల భరతం పడతామని భారతీయ సోషిత్ సేన కన్స్యూమర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు దుబ్బ నీరజ హెచ్చరించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉదయం పాల ప్యాకెట్ నుంచి రాత్రి నిద్రపోయే వరకు వాడుతున్న చాలా వస్తువుల్లో కల్తీ జరుగుతోందన్నారు. అటువంటి సంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కల్తీల నివారణకు ప్రభుత్వం కంటే ప్రజలే ఎక్కువగా అప్రమత్తం కావాలని, ప్రతి వస్తువుకు కచ్చితంగా రసీదు పొందాలని సూచించారు. చిన్న దుకాణం నుంచి మాల్స్ వరకు కల్తీ జరుగుతున్నట్లు తాము గుర్తించామని, వీటిపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఎవరైనా కల్తీ వస్తువులు కొని మోసపోతే తమ సంస్థ నంబర్ 88970 86608ను సంప్రదించి న్యాయం పొందాలని కోరారు.