జీడిమెట్ల, వెలుగు: దుండిగల్లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, ఆరు నెలల పాటు బందీగా ఉంచి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి మేడ్చల్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన షేక్ నసీర్ (35) 2021 అక్టోబర్లో ఓ బాలికను బెదిరించి ముంబైకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటనపై దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
2022 మే నెలలో నిందితుడిని అరెస్ట్ చేసి చార్జిషీట్ఫైల్ చేయగా, ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం తాజాగా నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.
