ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో  అంబరాన్నంటిన హోలీ సంబరాలు

ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో  అంబరాన్నంటిన హోలీ సంబరాలు

ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ​జిల్లాల్లో మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే  చిన్నా, పెద్దా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. యువత డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ.. కేరింతలు కొడుతూ వేడుకలు చేసుకున్నారు.

పలువురు రాజకీయ నాయకులు, అధికారులు హోలీ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హోలీ పర్వదినంతో వీధులన్నీ రంగులమయంగా మారి సందడి వాతావరణం నెలకొంది. చిన్నారులు హ్యాపీ హోలీ అంటూ కేరింతలు కొట్టారు.- వెలుగు, నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్