థామస్‌‌‌‌–ఉబెర్‌‌‌‌ కప్‌‌‌‌లో .. ఇండియా క్వార్టర్స్‌‌‌‌తోనే సరి

 థామస్‌‌‌‌–ఉబెర్‌‌‌‌ కప్‌‌‌‌లో ..  ఇండియా క్వార్టర్స్‌‌‌‌తోనే సరి

చెంగ్డూ: థామస్‌‌‌‌–ఉబెర్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా జట్ల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన ఉబెర్‌‌‌‌ కప్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లో ఇండియా 0–3తో బలమైన జపాన్‌‌‌‌ చేతిలో కంగుతిన్నది. తొలి సింగిల్స్‌‌‌‌లో అష్మితా చాలియా 10–21, 22–20, 15–21తో అయా ఒహోరి చేతిలో పోరాడి ఓడింది. విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో ప్రియా–శ్రుతి మిశ్రా 8–21, 9–21తో నమి మత్సుయమా–చిహారు షిదా చేతిలో కంగుతిన్నారు. 

రెండో సింగిల్స్‌‌‌‌లో నజోమి ఒకుహర 21–15, 21–12తో ఇషారాణి బరుహాపై నెగ్గింది. థామస్‌‌‌‌ కప్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లోనూ ఇండియా మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ 1–3తో చైనా చేతిలో పరాజయంపాలైంది. తొలి సింగిల్స్‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌ 21–15, 11–21, 14–21తో షి యు కీ చేతిలో ఓడగా, రెండో సింగిల్స్‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌ 13–21, 21–8, 21–14తో లి షి ఫెంగ్‌‌‌‌పై నెగ్గాడు. కానీ డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ 15–21, 21–11, 12–21తో లియాంగ్‌‌‌‌ వీ కెంగ్‌‌‌‌–వాంగ్ చాంగ్‌‌‌‌ చేతిలో, ధ్రువ్‌‌‌‌ కపిల–సాయి ప్రతీక్‌‌‌‌ 10–21, 10–21తో హి జి టింగ్‌‌‌‌–రెన్‌‌‌‌ జియాంగ్ యు చేతిలో ఓటమిపాలయ్యారు.