
వెల్లింగ్టన్: వన్డే వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్. కుడి మోకాలి గాయంతో ఐపీఎల్ మొత్తానికి దూరమైన మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. మరో మూడు వారాల్లో సర్జరీ చేయించుకోనున్నాడు. దీంతో అక్టోబర్–నవంబర్‌లో ఇండియా వేదికగా జరిగే వరల్డ్‌కప్‌కు అతను అందుబాటులో ఉండటం కష్టంగా మారింది.
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన కేన్.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. కుడి మోకాలికి తీవ్ర గాయం కావడంతో ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ కూడా చేయలేదు. తర్వాత టోర్నీకి దూరమై స్వదేశానికి వెళ్లిపోయాడు. న్యూజిలాండ్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని మోకాలి లిగ్‌మెంట్‌లో చీలిక వచ్చిందని తేలింది. దీనికి సర్జరీ అవసరమని డాక్టర్లు తేల్చారు.