హైదరాబాద్ సిటీలో ఈ ప్రాంతాల్లో వైన్ షాపులు బంద్

హైదరాబాద్ సిటీలో ఈ ప్రాంతాల్లో వైన్ షాపులు బంద్

గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం (జులై 9) ఉదయం 6 నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు మూతపడనున్నాయి. సికింద్రాబాద్ పరిధిలోని గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట, బోయిన్ పల్లి, గోపాలపురం, తుకారాం గేట్, మారేడ్ పల్లి, మహంకాళి, రాంగోపాల్ పేట, మార్కెట్ పీఎస్, తిరుమలగిరి, కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్ షాపులు, బార్లు అన్నీ బంద్ కానున్నాయి. లష్కర్ బోనాల సందర్భంగా వైన్ షాపులు, బార్లు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.