అభినందన్ కు వీర్ చక్ర అవార్డు

అభినందన్ కు వీర్ చక్ర అవార్డు

ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రేపు ఆయన్ను వీర్ చక్ర పురస్కారంతో సత్కరించనుంది.

ఫిబ్రవరి 27న బాలాకోట్ దాడుల్లో పాల్లోన్న అభినంద‌న్‌ పాకిస్థాన్ కు చెందిన ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌ను కూల్చి వేశాడు. ఆ తర్వాత తన విమానం మిగ్-21 లో సాంకేతిక లోపం రావడంతో పారాచ్యూట్ సాయంతో పాక్ లో ల్యాండయ్యాడు. అది గమనించిన పాక్ ఆర్మీ అతన్ని బంధించింది.  ఆ తర్వాత అతని విడుదల కోసం భారత్ పాక్ పై ఒత్తిడి పెంచడంతో.. వియన్నా ఒప్పంతం ప్రకారం.. వింగ్‌ కమాండర్‌ను ఇండియాకు అప్పగించింది పాకిస్థాన్. శత్రు దేశంలో ఉన్నా కూడా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ భారత ప్రభుత్వ అభినందన్ కు ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనుంది.