టెస్టుల కోసం గంటలు.. పొంటెలు

టెస్టుల కోసం గంటలు.. పొంటెలు

 

  •     ఒంటి గంట వరకే టెస్టులు చేస్తున్నరు
  •     పొద్దున 10 దాటాక వెళ్తే తర్వాత రోజే పరీక్ష
  •     ప్రైవేట్ సెంటర్లలోనూ రెండ్రోజులు వెయిటింగ్‌​
  •     లేటవుతున్న ఆర్టీపీసీఆర్‌ రిపోర్టులు
  •     పీహెచ్‌సీల్లో వేధిస్తున్న స్టాఫ్ కొరత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా టెస్టులు చేయించుకునేందుకు జనం తిప్పలు పడుతున్నరు. గంటలు గంటలు క్యూలో నిలబడాల్సి వస్తున్నది. టెస్టు సెంటర్లలో ఒంటి గంట వరకే పరీక్షలు చేస్తున్నరు. పొద్దున 10 దాటినంక టెస్టుకు పోతే తర్వాత రోజే చేయించుకే పరిస్థితి ఉంటోంది. సర్కారు సెంటర్లలో లేటవుతోందని ప్రైవేటు సెంటర్లకు పోతే అక్కడ కూడా వెయిట్‌ చేయాల్సి వస్తోంది. ప్రైవేటులో టెస్టు చేయించుకోవడానికి రెండ్రోజులు ఆగాల్సి వస్తోంది. ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టు చేయించుకున్న వాళ్లకు రిపోర్టులు లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వస్తున్నాయి. మరోవైపు పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీల్లో స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. పోస్టులు భర్తీ చేయాలని అధికారులకు లెటర్లు రాస్తున్నారు.  

పొద్దున 7 గంటలకే క్యూ 

టెస్టులు చేయించుకోవడానికి గతేడాది జనం తక్కువగా వచ్చారు. ఇప్పుడు మాత్రం టెస్టు సెంటర్ల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కొన్ని సెంటర్ల దగ్గర పొద్దున 7 గంటలకే జనం క్యూ కడుతున్నారు. గోల్కొండ ఏరియా హాస్పిటల్, సరోజినిదేవి, ఆయుర్వేద హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు అనేక పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెంటర్లకు సోమవారం చాలా మంది కరోనా అనుమానితులు వచ్చారు. టెస్టుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందంటున్నారు. సెంటర్ల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో ఎండలో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. పొద్దున 10 గంటల తరువాత టెస్టుకు వస్తే అప్పటికే అక్కడ వంద మందికి పైగా ఉంటున్నారని, టెస్టులు చేసేందుకు టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిపోక తర్వాతి రోజు రావాలని హెల్త్ స్టాఫ్ చెబుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ సెంటర్లలో లేటవుతోందని ప్రైవేటుకు పోతే అక్కడ కూడా రెండ్రోజులు ఆగాల్సి వస్తోందని చెబుతున్నారు. చాలా ప్రైవేట్ సెంటర్లలో టెస్టు కోసం ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్లాట్ బుకింగ్ ఫెసిలిటీ కల్పించారు. వాటిల్లో రెండో రోజు కూడా స్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొరకట్లేదు. సర్కారు​ సెంటర్లలో టెస్టులను మరింత పెంచాలని సిటీ జనం కోరుతున్నారు. 

రోజూ 12 వేల టెస్టులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 114 ప్రభుత్వ సెంటర్లలో కలిపి రోజూ 12 వేల యాంటిజెన్ టెస్టులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామన్నారు. ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వందకు పైగా టెస్టులు జరుగుతున్నాయి. ఏరియా, టీచింగ్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు వందలకు పైగా కూడా చేస్తున్నారు. గతంలో స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మొబైల్ బస్సులను పెట్టి టెస్టులు చేశారు. ఇప్పుడూ బస్సులను అందుబాటులోకి తెస్తే ఎక్కడివారు అక్కడే టెస్టులు చేయించుకుంటారు. సెంటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుంది.

పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 1 వరకే 

అన్ని సెంటర్లలో మధ్యాహ్నం ఒంటి గంట వరకే టెస్టులు చేస్తున్నారు. గతేడాది పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పరీక్షలు చేశారు. ప్రస్తుతం పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే చేస్తున్నారు. దీంతో సెంటర్ల నుంచి చాలా మంది వెనుదిరుగుతున్నారు. సర్కారు సెంటర్లలో ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం శాంపిల్ ఇచ్చిన వాళ్లకు రిపోర్టులు రెండు, మూడ్రోజులకు వస్తున్నాయి. టెస్టులు ఎక్కువగా అవుతుండటంతో రిపోర్టులు వచ్చేందుకు లేటవుతోంది.

స్టాఫ్ కొరతతో ఇబ్బంది

పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెంటర్లలో స్టాఫ్ కొరత వేధిస్తోంది. సిటీలో 89 యూపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు ఉన్నాయి. ఇందులో 9సెంటర్లు 24 గంటల పాటు కొనసాగుతున్నాయి. ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఓ ల్యాబ్ టెక్నీషియన్, ఓ ఫార్మాసిస్ట్ ఉండాలి. వీరితో పాటు ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 5 మంది ఏఎన్ఎంలు, 16 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. ఇందులో 20 పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీల్లో ఫార్మాసిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వ్యాక్సిన్ స్టార్టయిన సెంటర్లలో మెడికల్ ఆఫీసర్లు అబ్జర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండాలి. ప్రస్తుతం ఒక మెడికల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ పనే సరిపోతోంది. వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సంబంధించిన రిజిస్ర్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు టీకా ఇవ్వడానికి స్టాఫ్ నర్సులు ఇద్దరు కావాలి. కరోనా టెస్టులనైతే ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం, ఆశా వర్కర్ల సాయంతో ల్యాబ్ టెక్నీషియన్లు చేస్తున్నారు. వీళ్లలోనే మరికొందరు చిన్నారులకు ఇమ్యూనైజేషన్ నిర్వహించడానికి వెళ్తున్నారు. ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరే టెస్టులు చేస్తుండటంతో టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిపోవట్లేదని హెల్త్ స్టాఫ్ చెబుతున్నారు. టెస్టులు చేశాక ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంటర్ చేసేందుకు టైమ్ పడుతుండటంతో మధ్యాహ్నం ఒకటి దాటితే తర్వాత రోజు రావాలని ప్రజలకు స్టాఫ్ సూచిస్తున్నారు. స్టాఫ్ సరిపోవడం లేదంటూ పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీల నుంచి ఉన్నతాధికారులకు లెటర్లు రాస్తున్నారు.

ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు

సిటీలోని 50 ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో టెస్టులు చేస్తున్నారు. ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బ్రాంచీలుంటే అక్కడ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా దాదాపు 150 సెంటర్లున్నాయి. ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోజూ వంద వరకు టెస్టులు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం ప్రైవేట్ సెంటర్లకు వెళ్తున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రెండ్రోజుల వరకు స్లాట్స్ దొరకట్లేదు. పేరున్న హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మూడో రోజు కూడా అనుకున్న టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టెస్టులు చేయించుకోలేని పరిస్థితి. కొన్ని సెంటర్లేమో డబ్బులను ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. శివారు ప్రాంతాల్లోని హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ టెస్టుల దందా జోరుగా సాగుతోంది. టెస్టులు, పీపీఈ కిట్ల ఫీజులంటూ రూ.1,200లకు పైగానే వసూలు చేస్తున్నారు.

పోస్టులను త్వరలో భర్తీ చేస్తం

పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీల్లో టెస్టులు ఎక్కువ చేస్తున్నం. ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వందకు పైగానే టెస్టులు జరుగుతున్నాయి. స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరత లేకుండా త్వరలోనే భర్తీ చేపడ్తం. టెస్టులు, వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేగం పెంచాం. అన్ని రోజుల్లో టెస్టులు, వ్యాక్సిన్ అందిస్తున్నం.  
- డాక్టర్ వెంకటి, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో, హైదరాబాద్ జిల్లా