పాపం ఈ ఫ్యామిలీ.. కూతురి డెడ్ బాడీని కిందకు దించి.. అదే ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి !

పాపం ఈ ఫ్యామిలీ.. కూతురి డెడ్ బాడీని కిందకు దించి.. అదే ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి !

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో ఉన్న వైట్ ఫీల్డ్ ఏరియా గురించి వినే ఉంటారు. ఈ వైట్ ఫీల్డ్ ఏరియాకు దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో విషాద ఘటన జరిగింది. 24 ఏళ్ల వయసున్న యువతి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురి ఆత్మహత్యను తట్టుకోలేక.. తాను బతకలేనని బయట ఉన్న భర్తకు ఫోన్ చేసి చెప్పి.. కూతురి డెడ్ బాడీని కిందకు దించి.. అదే ఫ్యాన్కు తల్లి కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.

గత సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఇద్దరూ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీజా రెడ్డి అనే 24 ఏళ్ల యువతి బెంగళూరులోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా అనలిస్ట్గా పనిచేస్తోంది. శ్రీజా కుటుంబంతో కలిసి బెంగళూరులోనే ఉండేది. శ్రీజా తల్లి భారతి రెడ్డి గృహిణి. శ్రీజా తండ్రి శ్రీధర్ రెడ్డి బెంగళూరులో వ్యాపార రంగంలో కొనసాగుతున్నాడు.

శ్రీజ ఆదివారం కాస్త ఆలస్యంగా బెడ్ రూంకి వెళ్లి పడుకుంది. కూతురు నిద్రపోయిందనుకుని ఆమె తల్లి మరో బెడ్ రూంలోకి వెళ్లి నిద్రపోయింది. సోమవారం ఉదయం యథావిధిగా శ్రీజ తండ్రి ఆఫీస్కు వెళ్లిపోయాడు. ఆలస్యంగా పడుకుంది కాబట్టి ఆలస్యంగా నిద్ర లేస్తుందని శ్రీజను ఆమె తల్లి నిద్ర లేపలేదు. అయితే.. ఎంతసేపటికీ బెడ్ రూం నుంచి కూతురు బయటకు రాకపోవడంతో బెడ్ రూం తీసి చూడగా కూతురు ఫ్యాన్కు ఉరేసుకుని విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. కళ్ల ముందు కన్న కూతురుని అలా చూసే సరికి శ్రీజ తల్లికి గుండె పగిలినంత పనయింది.

Also Read:-నెలకు ఆరు వేల భరణం కట్టలేక.. సెకండ్ వైఫ్ను పోషించలేక.. చైన్ స్నాచర్గా మారిన భర్త !

కూతురు లేని జీవితాన్ని శ్రీజ తల్లి ఊహించుకోలేకపోయింది. శ్రీజ తల్లి తన భర్తకు ఫోన్ చేసి.. కూతురు ఇలా ఉరేసుకుని ప్రాణాలు తీసుకుందని.. తాను బతకలేనని చెప్పి కాల్ కట్ చేసింది. శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత తన భార్యకు ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు. శ్రీజ డెడ్ బాడీని కిందకు దించి అదే ఫ్యాన్ కు ఆమె తల్లి భారతి రెడ్డి కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. 

శ్రీధర్ రెడ్డి ఇంటికొచ్చే సరికి భార్య, కూతురు శవాలుగా కనిపించేసరికి ఆయన గుండెలవిసేలా రోదించారు. ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. శ్రీజ బెడ్ రూంలో ఒక డెత్ నోట్ లభ్యమైంది. కొంత కాలంగా డిప్రెషన్లో ఉన్న తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని ఆ డెత్ నోట్లో శ్రీజ రాసింది. మానసిక ఒత్తిడికి లోనై శ్రీజ తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది.