బండ్లగూడ చోరీ కేసులో మహిళ అరెస్ట్..రూ.15 లక్షల సొత్తు రికవరీ

బండ్లగూడ చోరీ కేసులో మహిళ అరెస్ట్..రూ.15 లక్షల సొత్తు రికవరీ

ఓల్డ్‌‌‌‌‌‌‌‌సిటీ, వెలుగు: బండ్లగూడ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్ పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసి, ఆమె వద్ద బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బండ్లగూడ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఏసీపీ ఎ. సుధాకర్, బండ్లగూడ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ ఆర్. దేవేందర్  వివరాలు వెల్లడించారు. గౌస్‌‌‌‌‌‌‌‌నగర్ ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన ఎన్.గిరిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మే 30న యాదగిరిగుట్టకు వెళ్లాడు. 

అదే రోజు అర్ధరాత్రి ఆయన ఇంట్లో సుమారు 91 గ్రాముల బంగారు ఆభరణాలు, 100 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గౌస్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన కాపరి నర్సమ్మ(44)ను నిందితురాలిగా గుర్తించి అరెస్ట్​ చేశారు. 8.2 తులాల బంగారు ఆభరణాలు, 1 కిలో 80 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సొత్తు విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.


.