కాళ్లపై పడిన మహిళను తప్పుబట్టిన కేటీఆర్

కాళ్లపై పడిన మహిళను తప్పుబట్టిన కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన కేటీఆర్...పలువురు లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించి వెళ్లిపోయారు. అంతకుముందు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన KTR కాళ్లపై పడింది ఓ మహిళ. తనకు డబుల్ బెడ్రూం ఇప్పించాలని కోరింది. ఐతే కాళ్లపై పడొద్దని సూచించిన కేటీఆర్... డబుల్ బెడ్రూం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో  2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. 34వ వార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్టార్ట్ చేశారు.