- వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఘటన
వికారాబాద్, వెలుగు : కౌలుకు తీసుకున్న పొలంలో నుంచి ఇసుక తీస్తుండగా పొలం యజమాని కుటుంబీకులపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన బుధవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మైల్వార్ గ్రామానికి చెందిన దానం సాయిలు, రేణుక కలిసి వారి పెద్దనాన్న దానం దేవప్ప పొలం పక్కన ప్రవహించే వాగు కాలువ నుండి ఇసుక తవ్వుకునేందుకు కంసాన్ పల్లికి వెళ్లారు.
అదే పొలాన్ని కౌలు తీసుకున్న రైతు గొల్ల అశోక్, కృష్ణ కలిసి సాయిలు, రేణుకలపై కత్తితో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలై రక్తస్రావంతో ఉన్న రేణుకను హుటాహుటిన తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే వైద్యం అందించారు. ఈ దాడిలో గాయాలపాలైన సాయిలు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.
