పెళ్లి చేసుకోకున్నా భార్యగా ప్రచారం.. యువకుడిపై యువతి ఫిర్యాదు

పెళ్లి చేసుకోకున్నా భార్యగా ప్రచారం.. యువకుడిపై యువతి ఫిర్యాదు

ఉప్పల్‌‌‌‌, వెలుగు: పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేస్తూ తనను ఓ యువకుడు ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఓ యువతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె తెలిపిన ప్రకారం.. రామంతపూర్‌‌‌‌కు చెందిన 22 ఏళ్ల యువతికి బంధువైన సాయిచరణ్ ఏడాది కాలంగా తనను పెళ్లి చేసుకోవాలని మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నాడు. 

యువతిని భార్యగా చెప్పుకుంటూ పరువు తీస్తున్నాడు. గత నెల 28న అర్ధరాత్రి సమయంలో సాయిచరణ్ పదేపదే ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడటంతో భయాందోళనకు గురైన బాధితురాలు, తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.