మహిళా జర్నలిస్టుపై దుండగుల కాల్పులు

మహిళా జర్నలిస్టుపై దుండగుల కాల్పులు

ఢిల్లీలో మహిళా జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త మిథాలీ చందోలాఫై కాల్పులు జరిపారు కొందరు గుర్తుతెలియని దుండగులు. తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌ సమీపంలో  కాల్పులు జరిపారు. నోయిడాకు చెందిన మిథాలీ చందోలా శనివారం డ్యూటీ ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరారు. అప్పుడు సమయం అర్థరాత్రి 12.30గంటలు దాటింది. ఆమె కారు డ్రైవ్ చేస్తుండగా.. మారుతి స్విఫ్ట్ కారు ఆమెను ఓవర్ టేక్ చేసింది. అందులోంచి దిగిన ముసుగు ధరించిన వ్యక్తి మిథాలీపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అందులో ఒక బులెట్ ఆమె చేతికి తగిలింది. దాడికి ముందు దుండగులు మిథాలీ కారుపై కోడి గుడ్లతో దాడి చేశారు.గాయపడ్డ మిథాలీని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుగా ఉందని డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.