భారీ ధరకు మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులు

భారీ ధరకు మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులు

ఉమెన్స్ ఐపీఎల్తో బీసీసీఐ ఖజానా మరింత కళకళలాడనుంది.  మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఉమెన్స్ ఐపీఎల్‌ మీడియా హక్కుల కోసం బీసీసీఐ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్లో  స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌, సోనీ నెట్‌వర్క్, అమెజాన్ ప్రైమ్, రిలయన్స్ వయాకామ్ 18 , ప్యాన్ కోడ్, టైమ్స్ ఇంటర్నెట్, గుగూల్, డిస్కవరీ వంటి  బడా కంపెనీలు పోటీపడ్డాయి.  చివరకు రూ.951 కోట్ల భారీ మొత్తానికి రిలయన్స్ వయాకామ్ 18, ఉమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్ను దక్కించుకుంది.  2023-27 సీజన్లకు సంబంధించిన ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. మొత్తంగా ఒక్కో మ్యాచ్ కు రూ. 7.09 కోట్లు బీసీసీఐ ఖాతాలోకి చేరనున్నాయి. 

ఉమెన్స్  ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులు, డిజిటల్ ప్రసార హక్కులను కూడా  వయాకామ్18 సొంతం చేసుకుంది. ఇప్పటికే మెన్స్  ఐపీఎల్ 2023--27 సీజన్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐకి రూ.48,390 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు మహిళా ఐపీఎల్ 2023-27 సీజన్ హక్కుల వేలం ద్వారా రూ. 951 కోట్లు సమకూరాయి. ఉమెన్స్ ఐపీఎల్ టీమ్స్‌ని కొనుగోలు చేసేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫ్రాంఛైజీలు చాలా వరకూ ఆసక్తి చూపించాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంఛైజీలన్నీ మహిళల ఐపీఎల్ టీమ్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి  చూపడంతో  ఉమెన్స్ ఐపీఎల్‌కి మంచి క్రేజ్ వచ్చేసింది...

ఉమెన్స్  ఐపీఎల్ 2023 సీజన్‌లో ఐదు ఫ్రాంఛైజీలు బరిలో దిగబోతున్నాయి. వాటి వివరాలను బీసీసీఐ ఈ నెల 25న వెల్లడించనుంది.  ఉమెన్స్ ఐపీఎల్ లో భాగంగా  2023 నుంచి 2025 వరకు మూడు సీజన్లలో ఒక్కో జట్లు 22 మ్యాచులు ఆడనుంది. లీగ్ దశలో ఒక్కో టీమ్ 20 మ్యాచులు ఆడనుంది. టాప్ లో నిలిచిన జట్టు ఫైనల్ కు వెళ్లనుండగా..రెండు, మూడు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. అందులో గెలిచిన టీమ్..ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.  ఉమెన్స్ ఐపీఎల్ ను మార్చి 5 నుంచి 23 వరకు నిర్వహించే యోచనలో బీసీసీఐ  ఉంది.  

2026 సీజన్ నుంచి 33 నుంచి 34 మ్యాచులు నిర్వహించనుంది. మరోవైపు 2023 ఐపీఎల్ రెండు వేదికల్లో, 2024 ఐపీఎల్ మరో రెండు వేదికల్లో, 2025 ఐపీఎల్ ఒక్క  వేదికలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఆ తర్వాత సీజన్ల వేదికలను బీసీసీఐ ఖరారు చేస్తుంది. 

మరిన్ని వార్తలు