అమ్మాయి ముద్దిచ్చి దండ వేస్తే.. వీడేంటండీ ముద్ద పప్పులా..

అమ్మాయి ముద్దిచ్చి దండ వేస్తే.. వీడేంటండీ ముద్ద పప్పులా..

పెళ్లిళ్లకు సంబంధంచిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.  పెళ్లిళ్ల సీజన్‌లో రకరకాల ఫన్నీ, ఇంట్రెస్టింగ్ వెడ్డింగ్ వీడియోలు రోజుకొకటి వైరల్ అవుతున్నాయి. వధూవరులకు సంబంధించిన  వీడియోలు కొన్ని బీభత్సాన్ని సృష్టిస్తే  మరికొన్ని వీడియోలు అన్ని వీడియోలు సరదాగా ఉంటాయి .  ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెళ్లి.. భారతీయ సనాతన సాంప్రదాయంలో మరచిపోలేని వేడుక. అందుకే ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురానుభూతి. ఇక తన జీవితంలోకి తాను కోరుకున్న వాడే వరుడుగా వస్తే.. తాను కోరుకున్న ఆనందమే తన కళ్ల ముందు ఉంటే.. ఇక ఆ ఆనందమే తన జీవితాంతం ఉంటుందని తెలిస్తే.. ఆ యువతి సంతోషానికి అవధులుండవ్! ఇక ఆసంతోషాన్ని తట్టుకోలేక ఏకంగా ఆ యువతి పెళ్లిలో పూల దండలు మార్చుకొనే తంతులో ముందుగా వధువు.. వరుడి చెంపపై మద్దు పెట్టి తరువాత వరుడి మెడలో దండ వేసింది. ప్రస్తుతం ఈ వీడియోనే నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది. 

 

వధూవరులు కెమెరాలకు పోజులిచ్చి మాలలు పట్టుకొని ఉన్నారు. అకస్మాత్తుగా, వధువు వరుడి వైపు తిరిగి మరియు అతని చెంపపై ముద్దు పెట్టింది.  పెళ్లికి వచ్చిన అతిథులు ఈ జంటను ఉత్సాహ పరిచారు.  ఆ తర్వాత ఇద్దరూ పూల మాలలు మార్చుకుంటారు. అయితే వధువు ముద్దు పెట్టినప్పుడు వరుడు మాత్రం అలానే ఉన్నాడు. పెళ్లికి వచ్చిన వారి ఈ సీన్ ను రిపీట్ చేయాలని కోరారు.  అయినా అతను రియాక్ట్ కాలేదు కాని  స్నేహితుల వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఈ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ లో  ట్రెండింగ్ మీదలో భాయ్ లా అనే శీర్షికతో పోస్ట్ చేశారు.  ఈ వీడియోకు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

సోషల్ మీడియా యూజర్లు హాస్యాస్పదమైన కామెంట్స్ చేశారు. నదిలో ఎవరో మునిగిపోయారంటూ జనం బీభత్సం సృష్టిస్తున్నారని ఒకరు రాశారు. ఇలాంటి రొమాంటిక్ భార్య లభించడం పెళ్లికొడుకు అదృష్టమని మరొకరు కామెంట్ రాశారు. మరికొందరు వధువు దుస్తుల్లో క్యూట్‌గా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.   ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. మరి తెగ సంబంర పడిపోతున్న ఈ పెళ్లి కూతురుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.