IPL 2023 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. జట్టులో కీలక మార్పు

IPL 2023 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. జట్టులో కీలక మార్పు

ఐపీఎల్ 16 సీజన్ లో ఆరో మ్యాచ్ కు రంగం సిద్ధం అయింది. చెన్నై వేదికపై.. చెన్నై, లక్నోల మధ్య జరిగే మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్  ఎంచుకుంది. మొదటి మ్యాచ్ లో గుజరాత్ కు గట్టి పోటీ ఇచ్చిన చెన్నై.. హోం గ్రౌండ్ లో సత్తా చాటాలని చూస్తోంది. సూపర్ విక్టరీతో సీజన్ మొదలుపెట్టిన లక్నో అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది.

ఈ మ్యాచులో లక్నో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. మొదటి మ్యాచ్ ఆడిన ఉనాద్కట్ స్థానంలో యశ్ ఠాకూర్ ని తీసుకుంది. సీఎస్కే మొదటి మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. బౌలింగ్ ఆర్డర్ పరంగా చూస్తే సీఎస్కే కంటే.. గుజరాత్ కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. 

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (c), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(w), కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అవేష్ ఖాన్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(w/c), శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ఆర్ఎస్ హంగర్గేకర్