జాతీయ కెమెరా దినోత్సవం..వెరైటీగా ఫోటో గ్రాఫర్ల పూజలు

జాతీయ కెమెరా దినోత్సవం..వెరైటీగా ఫోటో గ్రాఫర్ల పూజలు

అందరిలో ఒకరిగా కాకుండా ప్రత్యేకంగా ఉంటారు కొందరు. జాతీయ కెమెరా దినోత్సవం సంధర్బంగా.. కెమెరాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి కెమెరాను అమ్మవారి రూపంలో అలంకరించారు కొందరు ఫోటో గ్రాఫర్స్. కెమెరా పరిభాషలో ఛాయా చిత్ర యంత్ర దేవతా అంగపుజా, అర్చన హోమం నిర్వహించారు. కెమెరా దేవత ప్రత్యేక పూజా విధానంను నిర్వహించి  తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ ఫొటో గ్రాఫర్స్ ఎక్కడున్నారో తెలుసుకుందాం..

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ క్షేత్రంలో జాతీయ కెమెరా దినోత్సవం సంధర్భంగా ధర్మపురి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫెర్స్ అధ్వర్యంలో జాతీయ ఫోటో గ్రాఫర్ల సంక్షేమార్థం కెమెరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కెమెరాకు పంచామృతాలతో అభిషకం అనంతరం కెమెరాను అమ్మవారిగా అలంకరించి సాధారణ పూజలతో పాటు కెమెరా పరిభాషలో అంగ పూజ,అర్చన,ధూప, దీప, నైవేద్యం, మంగళహారతి, హోమం,పూర్ణాహుతి,తీర్థ ప్రసాదాలు, వితరణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఛాయాచిత్ర యంత్ర దేవత పూజా విధానం ప్రత్యేకతను సంతరించుకున్నది.