శ్రీహరిని మెప్పించిన తొలి సంకీర్తనాకారుడు... అన్నమయ్య జనన రహస్యం ఇదే

శ్రీహరిని మెప్పించిన తొలి సంకీర్తనాకారుడు... అన్నమయ్య  జనన రహస్యం ఇదే

ఆయన జీవితం అంతా శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి అంకితమిచ్చాడు. అన్నమ య్య కడపజిల్లా రాజంపేట దగ్గరలో ఉన్న తాళ్ళపాకలో 1408 సంవత్సరం మే నెల లో  వైశాఖ పూర్ణిమా నాడు రోజున జన్మించినట్లు ఆయన జీవిత చరిత్ర చెబుతోంది. ఆయన నందవారిక అనే బ్రాహ్మణ వంశంలో జన్మించారు. ఆయ న పూర్వీకులు వైష్ణవ సాంప్రదాయులు. అన్నమయ్య తల్లితండ్రులు లక్కమాంబ, నారాయణ సూరి. వీరికి ఎంతకాలమైనా పిల్లలు కలగలేదు. ఎన్నో పూజలు, వ్రతాలు చేసారు. ఆఖరుగా ఆ దంపతులు తిరుమల బయలుదేరి వచ్చి ఆలయంలోని గాలిగో పురం వద్ద సాష్టాంగపడి, మనసులోని కోరిక స్వామికి విన్నవించి, దర్శనం చేసుకుని, మళ్ళీ విన్నవించారు. ఆ రాత్రి ఆ దంపతులకు ఒక కల వచ్చింది. ఆ కలలో స్వామి పంచాయుధాలలోని నందక ఖడ్గాన్ని స్వామి వారికి బహూకరించినట్లుగా కలగన్నా రు. ఆ దంపతులు మేల్కొని, కల విషయం చర్చించుకొని, స్వామి దయవల్ల సంతానం కలుగుతుంది అనే అభిప్రాయంతో వెళ్ళిపోయారు. తరువాత కొద్ది నెలలకే లక్క మాంబ గర్భవతి అయ్యింది. 

1408 వ సంవత్సరంలో   వైశాఖ పూర్ణిమా నాడు విశాఖ నక్షత్రంలో తొమ్మిది గ్రహాలలో ఏడు గ్రహాలు శుభస్థానాల్లో ఉండగా బాలుడు జన్మించాడు. అతనికి అన్నమయ్య అనే పేరు పెట్టారు. లేకలేక పుట్టిన కారణంగా గారాబంగా పెంచారు. తరచు ఆ గ్రామంలోనే ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి వెళ్ళి, అలవోకగా పాటలు పాడుతూ ఉండేవారు. ఒకసారి ఇంట్లో వాళ్ళు ఎందుకు కాలాన్ని వృథా చేస్తున్నావు. ఏదైనా పనిచేయి. చదువు కో!  అనేవారు. 

ఒకరోజు పొలం వెళ్ళి పశువులకు గడ్డి కోసుకుని తెమ్మన్నారు. గడ్డి కోస్తూండగా అన్నమయ్య చిటికిన వేలు తెగింది. ఒక్కసారిగా ఆయనలో వైరాగ్యం ముంచుకొచ్చింది. అసలు ఇదంతా ఎం దుకు? నేను ఎవరిని? వీళ్ళతో సంబంధం ఏమిటి అని నిర్వేదంలో ఉండగా, ఒక భక్త బృందం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి వెడుతుంటే, కొడవలి అక్కడ పడ వేసి, ఆ బృందంతో కలిసిపోయి గోవిందా హరి, గోవిందా హరి అంటూ తిరుమలకు వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో కొండపైకి నడిచే వెళ్ళవలసి వచ్చేది. అలా భక్త బృం దంతో కొండ ఎక్కుతున్న అన్నమయ్య ఆకలికి తట్టుకోలేక నీరసంతో పడిపోయాడు. అపుడు ఒక పండు ముత్తైదువు రూపంలో పద్మావతి దేవి వచ్చి, ఆప్యాయతగా పలకరించి, ఆకలి తీర్చి, స్వామి వారి ఆలయానికి మార్గం చూపించింది. అపుడు అన్న మయ్యకు ఏమీ కనపడలేదు. అపుడు ఆమె  ఈ కొండ అంతా సాలగ్రామ శిలలే. అందుకు నువ్వు చెప్పులు లేకుండా ఎక్కితే, కనపడుతుంది అని ధైర్యం చెప్పి అదృశ్యమయ్యింది. 

తిరుమలకు చేరిన అన్నమయ్య స్వామి సన్నిధిలో బంగారు వాకిట ముందు నిలబడి, శ్రీనివాసులును దర్శించారు. అన్నమయ్య ఒళ్ళంతా పులకితమయ్యింది. ఒక చేతిలో చక్రం, మరో చేతిలో శంఖం, పట్టుపీతాంబరం, ఆభరణాలు ధరించి ఉన్న స్వామివారిని దర్శించే సరికి....
కంటి నఖిలాండ కర్త నధికుని గంటి.. కంటి నఘములు వీడుకొంటి, నిజమూర్తి గంటి” అంటూ
అలవోకగా దర్శనం వల్ల తనకు కలిగిన అనుభూతిని వర్ణించాడు. అక్కడే కొన్ని రోజులు ఉండిపోయి శ్రీ వేంకటేశ్వరస్వామి మీద శతకాన్ని రాసాడు. అన్నమయ్య ఇం టికి రాకపోయేసరికి, తల్లితండ్రులు వెతుక్కుంటూ తిరుమల వచ్చి ఆయనను కలిసి, నీ భక్తికి అడ్డురామని చెప్పి ఇంటికి తీసుకెళ్ళారు. అప్పటి నుంచి, అన్నమయ్యలో భక్తి ఎక్కువగా ఉండేది. మరికొన్ని రోజులు తరువాత, అన్నమయ్య తిరుమల చేరి స్వామిని దర్శించి....

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా!..  
వయ్యా కోనేటి రాయడా! కోరి మమ్ము నేలినట్టి కులదైవమా; 
చాల నేరిచి పెద్ధవిచ్చిన నిదానమానెడయక 

 అంటూ పాడగానే అక్కడే ఉన్న అర్చకులందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు అన్నమయ్య స్నాన సంధ్యాదులు ముగించుకొని స్వామిని దర్శించడానికి వెళ్ళాడు. అక్కడ తలుపులు తాళం వేసి ఉన్నాయి. ఆవేదనతో అన్నమయ్య సంకీర్తన ఆలపించే సరికి గుడి తాళాలు ఊడిపోయి, దర్శనం అయింది. అర్చకులు భయపడి, అన్నమయ్య గొప్పతనాన్ని గుర్తించారు. అప్పుడే అన్నమయ్య ఇకనుండి నేను జీవించే వరకు ప్రతీరోజూ ఒక కీర్తన రాస్తా ను. .. ఆలపిస్తాను  అని ప్రతిజ్ఞ చేసాడు. అందుకే అన్నమయ్య దాదాపు 35వేల కీర్తనలు రాశాడని ప్రతీతి. అప్పట్లో టంగుటూరి ఆస్థానాధిపతి అన్నమయ్యను స్వామి వారిపై శృంగార కీర్తన రాయమంటే, 

ఆసువుగా  చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను ఏమొకో భామిని విభున కు వ్రాసిన పత్రిక కాదు కదా!

 అంటూ కీర్తన చెప్పి అందరి మన్న నలు పొందారు. అపుడు ఆస్థాన ప్రభువు నరసింగరాయలు తనపై శృంగార కీర్తన రాయమంటే అన్నమయ్య  శ్రీహరిని స్తుతించే ఈ నోటితో ఇతరులను ఎలా స్తుతిస్తుం ది...  అని సుతిమెత్తగా జవాబు ఇచ్చినా, నిండు సభలో అవమానపరచాడని, అన్న మయ్యను బందీచేస్తే .. ఆకటి వేళల అలవైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు అంటూ ఆలపిస్తే బంధవిముక్తుడను చేసాడు స్వామి. ఆయన రాసిన కీర్తనల్లో..

అదిగో అల్లదిగో హరివాసము, పదివేల శేషుల పడగల మయము

బ్రహ్మ కడిగిన పాదము, వంటి కీర్తనలు ఎన్నటికీ మరువలేనివి. 1503 దుందు భి నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి రోజున పెద్ద కుమారుడును పిలిచి, ”తిమ్మప్పా! నేటితో నా సంకీర్తనా యజ్ఞం పూర్తి అవుతుంది. ఈ ఒక్కరోజు సంకీర్తనతో నా యజ్ఞం పూర్తి అవుతుంది. ఈరోజు నా తరపున నీవు స్వామికి అర్చించే బాధ్యత నీదే. ఈ యజ్ఞం కొనసాగించవయ్యా! అంటూ తంబుర, చిడతలు, అందించాడు. అదే రోజు అన్నమయ్య శ్రీనివాసుని సేవ చేయడానికా అన్నట్లు, ఆయన శరీరం నుంచి ఒక కాంతి. దేవాలయం వైపు వెళ్ళిపోవడం అందరూ చూసారు. మధురాతి మధుర మైన కీర్తనలతో, సాక్షాత్తు ఆ శ్రీహరినే మెప్పించిన అన్నమయ్యను మనం గుర్తుచేసు కోవడమే ఆయనకు మనం ఇచ్చే గౌరవం...