జ్యోతిష్యం: మిథున రాశిలో.. సూర్యుడు సంచారం... 12 రాశుల ఫలితాలు ఇవే..

జ్యోతిష్యం: మిథున రాశిలో..   సూర్యుడు సంచారం... 12 రాశుల ఫలితాలు ఇవే..

నవగ్రహాలకు రారాజు సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.  ప్రస్తుతం వృషభరాశిలో  సంచరిస్తున్న సూర్యుడు మిథునరాశిలోకి జూన్ 15 సాయంత్రం 6:07 గంటలకు  ప్రవేశిస్తున్నాడు. సూర్య భగవానుడురాశిని మార్చడం వల్ల కొన్ని రాశుల అదృష్టాన్ని ప్రకాశవంతం చేయవచ్చు. మిథునరాశిలోకి సూర్యుని ప్రవేశం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

మేషరాశి : ఈ రాశి వారికి  సూర్యుడు మిథన రాశిలో సంచరించడం వలన అన్ని పనుల్లో విజయం కలుగుతుంది.  కొత్తగా ఇల్లు కట్టేందుకు అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది.  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.  పనిలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.  

వృషభరాశి:  ఈ రాశి వారికి జూన్​ 15 నుంచి నెల రోజుల పాటు  అద్భుతమైన ఫలితాలుంటాయి.  గతంలో నిలిచిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది.  సమాజంలో హోదా.. గౌరవం.. కీర్తి .. ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్​తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.  కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  

మిథునరాశి:   ఇదే రాశిలో సూర్యుడు సంచరించడం వలన మీరు చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండాపూర్తవుతాయి. కెరీర్​ విషయంలో మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.. కొత్త అవకాశాలు లభిస్తాయి. . భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. ప్రేమ ... పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.

కర్కాటకరాశి:  ఈ రాశి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. పూర్వీకులకు సంబంధించి ఆస్తి వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి.  ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  ఎలాంటి ఆందోళన పడకుండా  ఇష్ట దైవాన్ని స్మరించుకోండి.. అంతా మంచే జరుగుతుంది.

సింహరాశి:ఈ రాశికి అధిపతి సూర్యుడు. మొండి బకాయిలు వసూలవుతాయి.   పెండింగ్‌లో ఉన్న డబ్బు అందుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.  అయితే ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆఫీసులో పనికి తగిన గుర్తింపు పొందుతారు. సీనియర్ల మద్దతు లభిస్తుంది.   కుటుంబ సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అపారమైన విజయాలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి జాబ్​ వచ్చే అవకాశం ఉంది. . .

కన్యారాశి:  సూర్యుడు మిథున రాశిలో సంచరించడం వలన ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.  కెరీర్​ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాని కష్టపడాల్సి ఉంటుంది.  ప్రతి పని కూడా సవాళ్లతో పూర్తి చేస్తారు. మీరు చేపట్టిన పనులు మొదట్లో ఆందోళన కలిగినా.. చివరకు పూర్తి చేస్తారు.  ఆఫీసులో మీరే కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  పెళ్లి సంబంధాలు చూసేవారు గుడ్​ న్యూస్​ వింటారు. 

తుల రాశి: సూర్యుడు  .. మిథునరాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి  అదృష్టం కలిసి వస్తుంది. దీంతో పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి.  ఉద్యోగస్థులకు ప్రమోషన్​ లభిస్తుంది.  ఆస్తికి సంబంధించిన లావాదేవీలు పరిష్కారమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. మీరు ముఖ్యమైన నిర్ణయం తీసుకొనేటప్పుడు మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి. 

వృశ్చికరాశి:  ఈ రాశి వారికి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.  డబ్బు  లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి.  ముఖ్యంగా ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్స్​ జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు కలుగుతాయి.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  పనిభారం పెరిగినా సంతృప్తి కరంగానే ఉంటుంది. ప్రతి పనిలోను సానుకూల ఫలితాలు పొందుతారు. 

ధనస్సురాశి: ఈ రాశి వారు అనవసరమైన వాదనలు పెట్టుకోవద్దు.  ప్రతి విషయంలో ఓర్పు .. సహనం పాటించండి.  సహోద్యోగులతో కలిసి పనిచేయండి. కుటుంబసభ్యుల మద్దతు ఉండడంతో మానసికప్రశాంతత ఏర్పడుతుంది.  ఆర్థికంగా ఎలాంటి మార్పు ఉండదు.వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితిలో కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు.  ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోండి. ప్రేమ వ్యవహారాలను వాయిదా వేయండి.  

 మకరరాశి:  ఈ రాశి వారికి సూర్యుడు మిథునంలో సంచరించడం వలన గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాచి.  కొత్త ఉద్యోగ​అవకాశాలు లభిస్తాయి.పని చేసే చోట ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.  కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు .. అంతా మంచే జరుగుతుంది. 

కుంభరాశి:  ఈ రాశివారు చాలా బిజీబిజీగా గడుపుతారు,  కొత్తగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  తోటి ఉద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు.  ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ ... పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి. 

మీన రాశి:  ఈ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతాయి.  కుటుంబ సభ్యులతో కొన్నివిషయాల్లో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది.  కేరీర్​ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు.  కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. దీర్ఘకాలికసమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.