
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( జూన్15 నుంచి 21 వ తేది వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం
మేష రాశి: ఈ రాశి వారు గతంలో పెట్టిన పెడుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. కెరీర్ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మొదట్లో కొంత ఆందోళన కలిగినా చివరకు అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. అనుకోకుండా ధనలాభం కలుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలను ప్రస్తుతం వాయిదా వేయండి.
వృషభ రాశి : ఈ వారం ఈరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక విషయాల్లో అప్రతమ్తంగా ఉండండి. ముఖ్యంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో రిస్క్ తీసుకోకండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ...మీ సీనియర్ల మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను అందుకుంటారు. ప్రేమ.. పెళ్లి విషయాలు అనుకూలిస్తాయి. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించండి.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.. అంతా మంచే జరుగుతుంది.
మిథున రాశి: ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులలో విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తప్పవని పండితులు చెబుతున్నారు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులు అధికంగా కష్టపడాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.. ఎవరితోనూ వాదనలు పెట్టుకోకుండా.. మీ పని మీరుచసుకుంటూ వెళ్లండి.. ఆధ్యాత్మిక చింతనతో గడపండి .. అంతా మంచే జరుగుతుంది.
కర్కాటకం - : ఈ వారం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే అధికంగా లాభాలొస్తాయి. ఉద్యోగస్తులు కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. ఈ వారం మధ్యలో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.
సింహరాశి: ఈ రాశి వారికి - ఈ వారంలో పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఇక వ్యాపారస్తుల విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్తగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారం మొదట్లో కొంత ఆందోళన కలిగినా.. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది.
కన్య రాశి : ఈ రాశి వారు ఈ వారంలో చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. అయినా మీ తెలివి తేటలతో అధిగమిస్తారు. కొన్ని అనవసర ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు వారం చివరిలో ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. ఇక వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు జాబ్ లభించే అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
తులా రాశి : ఈ రాశి వారు ఈ వారం సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. డబ్బును ఆదా చేసేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. ఆఫీసులో కీలక పాత్ర పోషించాల్సి రావడంతో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. పెళ్లి.. ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. జీవితం సాఫీగా సాగిపోతుంది.
ధనుస్సు రాశి : ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు పురోగతి సాధించే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెడతారు. లాభాలు పొందుతారు. ఉద్యోగస్తుల విషయంలో కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. ఆఫీసులో జాగ్రత్తగా ఉండంది.. మీతో స్నేహంగా ఉంటూనే మీకు అపకీర్తి తీసుకొస్తారు. పూర్వీకుల ఆస్తికలసి రావడంతో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. జాగ్రత్తగా ఉండండి.
మకరరాశి : ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ సౌకర్యాల కోసం కొంత డబ్బు అదనంగా ఖర్చు చేసే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఆఫీసులో ప్రశంశలు.. అవార్డులు అందుకుంటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోను వాదించకుండా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. . కొంతమంది విదేశీ పర్యటనకు వెళ్లవచ్చు. మీకు తల్లిదండ్రుల నుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మీనరాశి: ఈ రాశి వారికి ఈ వారం కార్యాలయంలో పనిభారం పెరిగే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తులు పరిచయమయ్యే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ప్రేమ..పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.