జ్యోతిష్యం: శని షడాష్టకయోగం.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం... 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

జ్యోతిష్యం:  శని షడాష్టకయోగం.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం... 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

వేద జ్యోతిష్యం ప్రకారం, నవ గ్రహాలలో కుజుడు , శని దేవునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శని దేవుడు న్యాయం, కర్మలకు అధిపతిగా ఉంటాడు. కుజుడిని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు ఆరు, అష్టమ స్థానాల్లో ఉన్నప్పుడు షడాష్టక యోగం ఏర్పడుతుంది. .  

కుజుడు ...  కేతువు...  శనితో షడాష్టక యోగం కారణంగా...కుజుడు తన ఉగ్ర రూపాన్ని  ప్రదర్శిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.  దీని కారణంగా ప్రకృతి వైపరీత్యాలు, హింస, అగ్నిప్రమాదాలు, గాలి వల్ల కలిగే వర్షం, వరదలు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలు  సంభవించే అవకాశం ఉంది.  ఇక 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందోతెలుసుకుందాం. . . 

జూన్​ 15  ఆదివారం ఉదయం 6.43 గంటలకు సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించాడు. గురువు...  బుధుడు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నారు. సూర్యుడు, బుధుడు  గురువు అనే మూడు గ్రహాలు శనితో కలిసి కేంద్ర యోగం , రాహువుతో  పంచమ యోగం ... కుజుడు ...  కేతువుతో త్రి ఏకాదశ యోగం ఏర్పడ్డాయి.  కుజుడు ...  కేతువు...  శనితో షడాష్టక యోగం .. రాహువుతో సం సప్తక యోగం కలిగి ఉన్నారు. సూర్యుడు ..  బుధుల కలయిక బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది.  సూర్యుడు మిథునరాశిలో ఒక నెల పాటు అంటే జూలై 16న సాయంత్రం 5.33 గంటల వరకు ఉంటాడు. 

మేషం: కుజుడు ...  కేతువు...  శనితో షడాష్టక యోగం కారణంగా ... ఈ రాశి వారికి  ధైర్యం పెరిగే అవకాశం ఉంది. 
 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.  పనిలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.  
వృషభ రాశి:  ఈ  రాశి వారు  వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అద్భుతమైన ఫలితాలుంటాయి.  గతంలో నిలిచిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. 
మిథునరాశి:  ఈరాశి వారికి సమాజంలో గౌరవం..   కీర్తి .. ప్రతిష్ఠలు లభిస్తాయి.  భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.  
కర్కాటక రాశి:  ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  ఎలాంటి ఆందోళన పడకుండా  ఇష్ట దైవాన్ని స్మరించుకోండి..
సింహరాశి: ఈరాశి వారికి  కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. అవార్డు పొందే అవకాశం ఉంది.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  ఆఫీసులో పనికి తగిన గుర్తింపు పొందుతారు. సీనియర్ల మద్దతు లభిస్తుంది. 
కన్యారాశి : కార్యాలయంలో మీకు గౌరవం లభిస్తుంది. దూర ప్రయాణాలు మానుకోండి. కెరీర్​ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు..  కాని కష్టపడాల్సి ఉంటుంది.  ప్రతి పని కూడా సవాళ్లతో పూర్తి చేస్తారు. మీరు చేపట్టిన పనులు మొదట్లో ఆందోళన కలిగినా.. చివరకు పూర్తి చేస్తారు.  
తులా రాశి: పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం  ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది.   ఆస్తికి సంబంధించిన లావాదేవీలు పరిష్కారమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.
వృశ్చికరాశి : విద్యార్థులకు ఎంతో  ప్రయోజనం కలుగుతుంది. భార్య తరపు కుటుంబం నుంచి శుభవార్త వింటారు.  ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. డబ్బు  లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి.  
ధనుస్సు రాశి:  ఈ రాశి వారు  పిల్లల విషయంలో  శుభవార్త వింటారు. వ్యాపారంలో లాభం పొందుతారు.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోండి. 
మకరరాశి: ఈ రాశి వారు కొత్తగా భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.
కుంభం:  షడాష్టక యోగం కారణంగా  ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.కొత్తగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఖర్చులు పెరుగుతాయి. 
మీనరాశి: సమాజంలో  కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  కుటుంబ సభ్యులతో కొన్నివిషయాల్లో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.