
లండన్: ఫిడే వరల్డ్ ర్యాపిడ్ టీమ్ టైటిల్‌ను గెలుచుకున్న ఇండియా ప్లేయర్లతో కూడిన టీమ్ ఎంజీడీ1 బ్లిట్జ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో నిరాశపరిచింది. మెగా టోర్నీలో ఐదో ప్లేస్‌తో సరిపెట్టింది. రౌండ్ రాబిన్‌లో సత్తా చాటి టాప్ ప్లేస్‌తో నాకౌట్ రౌండ్‌కు క్వాలిఫై అయిన ఎంజీడీ1 క్వార్టర్స్‌లో తడబడింది. అమెరికా జీఎం లెవాన్ అరోనియన్, ఇండియా ప్లేయర్ విదిత్ గుజరాతీ వంటి మేటి ఆటగాళ్లున్న హెక్సామైండ్ చెస్ టీమ్ చేతిలో 2–4 తేడాతో ఓటమి పాలైంది.
ఈ హోరాహోరీ పోరులో హెక్సామైండ్ ఆటగాడు అనీశ్ గిరి చేతిలో ఇండియా పి. హరికృష్ణ ఎండ్‌గేమ్‌లో ఓడిపోవడంతో మ్యాచ్ ఫలితం తేలిపోయింది. ఎరిగైసి అర్జున్ నేతృత్వంలోని ఎంజీడీ అనంతరం జరిగిన ఐదో ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో 4-–2తో చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్‌తో కూడిన ఫ్రీడమ్ జట్టుపై విజయం సాధించింది. మరోవైపు ఈ టోర్నమెంట్ ఫైనల్లో డబ్ల్యూఆర్ చెస్ జట్టు.. కాజ్‌చెస్ టీమ్‌ను ఓడించి బ్లిట్జ్ టైటిల్ కైవసం చేసుకుంది. 2023లో ఈ టోర్నీ మొదలైనప్పటి నుంచి డబ్ల్యూఆర్ టీమ్‌కు ఇది రెండో బ్లిట్జ్ టైటిల్ కావడం విశేషం.