- ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు
- ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
హైదరాబాద్, వెలుగు: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హాఫ్ డే స్కూళ్లు ఈ విద్యాసంవత్సరం చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని ప్రకటించారు. అన్ని మేనేజ్మెంట్ల స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేయాలని ఆయన సూచించారు.
విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించి పంపించాలని ఆదేశించారు. టెన్త్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఎస్ఎస్ సీ పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లలో మాత్రం పరీక్షలు జరిగే రోజుల్లో క్లాసుల టైమింగ్స్ మార్చారు. ఆయా స్కూళ్లు పరీక్షలు ఉన్న రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని వెల్లడించారు.
