IPO News: అదరగొట్టిన ఐపీవో.. తొలిరోజే ఇన్వెస్టర్లకు 50 శాతం లాభం.. మీరూ బెట్ వేశారా..?

IPO News: అదరగొట్టిన ఐపీవో.. తొలిరోజే ఇన్వెస్టర్లకు 50 శాతం లాభం.. మీరూ బెట్ వేశారా..?

Sacheerome IPO: చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు మార్కెట్ల బూమ్ కొనసాగుతున్నప్పుడు వచ్చిన ఐపీవో ఇన్వెస్టర్లకు లిస్టింగ్ రోజునే మంచి రాబడులను తెచ్చిపెట్టింది. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సచీరోమ్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు ఇష్యూ ధర కంటే 50 శాతం ప్రీమియం ధర రూ.153 వద్ద నేడు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఇది గ్రేమార్కెట్లో ఊహించినట్లుగానే పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించింది. కంపెనీ ఐపీవో కోసం తన స్టాక్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.96 నుంచి రూ.102గా నిర్ణయించింది. ఇదే క్రమంలో లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా ఉంచిన సంగతి తెలిసిందే. కంపెనీ రిటైల్ పెట్టుబడిదారుల సబ్ స్క్రిప్షన్ కోసం జూన్ 9 నుంచి 11 వరకు అందుబాటులో ఉంచింది.

నేడు కంపెనీ షేర్లు బంపర్ లిస్టింగ్ తర్వాత కూడా ఇన్వెస్టర్ల నుంచి కొనసాగిన కొనుగోళ్ల డిమాండ్ కారణంగా 4 శాతం పెరిగి రూ.160 స్థాయికి చేరుకుంది. కంపెనీ తాజా ఐపీవో నుంచి రూ.61కోట్ల 62 లక్షలను విజయవంతంగా సమీకరించి ఎస్ఎమ్ఈ కేటగిరీలో ఎన్ఎస్ఈలో జాబితా అయ్యింది. ఐపీవో మెుత్తం మూడు రోజుల్లో కలిపి ఏకంగా 313 సార్లు సబ్‌స్క్రిప్షన్ నమోదు చేసింది. ప్రధానంగా నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ఐపీవో మంచి డిమాండ్ చూసింది. 

కంపెనీ వ్యాపారం..
1992లో స్థాపించబడిన కంపెనీ సువాసనలు, ఫ్లేవర్స్ తయారీ, అభివృద్ధి వ్యాపారంలో ఉంది. కంపెనీ కాస్మెటిక్ కంపెనీలు, ఎఫ్ఎంసీజీ సంస్థలకు, ఫుడ్ ఇండస్ట్రీకి అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తుంది. అలాగే కంపెనీ తన ఉత్పత్తులను ఆఫ్రికాతో పాటు యూఏఈ దేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.