కలెక్టర్ పేరుతో ఫేక్ అకౌంట్.. భారీ దోపిడికి స్కెచ్

కలెక్టర్ పేరుతో ఫేక్ అకౌంట్.. భారీ దోపిడికి స్కెచ్

వరంగల్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేస్ బుక్ లో అకౌంట్ క్రీయేట్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ ఫోటోతో ఉన్న ఫేక్ అకౌంట్ నుంచి డబ్బులు కావాలంటూ రిక్వేస్ట్ మెసేజ్ లను పంపిచారు కేటుగాళ్ళు. కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్  డ‌బ్బులు కావాలంటూ  +94776414080 నుంచి రీక్వస్ట్ చేస్తూ పలువురికి మెసేజ్ లు పెట్టారు. 

 విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో అలెర్ట్ అయ్యారు కలెక్టర్ ప్రావిణ్య.  తన ఒరిజినల్ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా అందరిని అప్రమత్తం చేసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు శ్రీలంక నుంచి సైబర్ నేరగాళ్ళు ఈ ఫేక్ మెసేజ్ లను పంపించినట్లు గుర్తించారు.  మోసపూరిత మెసేజ్ లను నమ్మీ రెస్పాండ్ కావద్దు..  వెంటనే మెసేజ్ బ్లాక్ చేయాలని సూచించారు కలెక్టర్ ప్రావీణ్య