విద్యార్ధులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

విద్యార్ధులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందించాలని మహబూబాబాద్​ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. బుధవారం మహబూబాబాద్ మండలం పర్వతగిరి జడ్పీ హైస్కూల్, కురవి మండలం నేరేడ జడ్పీ హైస్కూల్​లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు చేశారు. పిల్లలకు అందిస్తున్న విద్య బోధనలను స్వయంగా పరిశీలించారు, నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ తరగతుల ద్వారా విద్యా బోధనలు అందించాలని కోరారు.

10వ తరగతి పరీక్షల్లో అన్ని విద్యాసంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని కోరారు. మండల ప్రత్యేక అధికారులు, క్షేత్రస్థాయిలో పర్యటన సమయంలో సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలను తనిఖీలు నిర్వహించాలని సూచించారు.