కొత్త మున్సిపాలిటీలో  కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం 

కొత్త మున్సిపాలిటీలో  కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం 

ములుగు, వెలుగు: జిల్లా ఏర్పాటు తర్వాత గ్రామపంచాయతీగా ఉన్న ఏకైక ప్రాంతం ములుగు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో బండారుపల్లి, జీవంతరావుపల్లి జీపీలను కలుపుతూ ములుగు మేజర్ జీపీని 2025 ఏప్రిల్ 5న మున్సిపాలిటీగా ఏర్పాటు చేయగా, ఎన్నికల్లో గెలుపొందిన కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరనుంది. కొత్త మున్సిపాలిటీలో తొలిసారి మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి, వైస్ చైర్ పర్సన్ గా ఆసియా షాహీన్ రియాజ్ మిర్జా ఎన్నికయ్యారు.

కాగా, ములుగు పట్టణంలో మేజర్​గా రోడ్ల, డ్రైనేజీ సిస్టం సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు కానుండడంతో ఆయా పనులు త్వరగా ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. నూతన చైర్​పర్సన్​ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన ములుగు మున్సిపాలిటీ తొలి చైర్ పర్సన్ గా ఎన్నికవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాజకీయాలు, పార్టీలకతీతంగా ప్రజలందరికీ మేలు జరిగే విధంగా పాలన కొనసాగిస్తామని చెప్పారు.