Sleeping Tips: త్వరగా నిద్రపట్టడం లేదా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

Sleeping Tips: త్వరగా నిద్రపట్టడం లేదా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

పూర్వ కాలంలోని జనాలకు ఇట్టా మంచం ఎక్కరో లేదో.. అట్టా నిద్రపోతారు.  ఒక్కోసారి నిద్ర ముంచుకొస్తుంది.  అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా  బెడ్డేక్కేస్తారు.అలా కనీసం8 గంటలు నిద్రపోయేవారు..   అందుకేనేమో మరి అప్పటి వాళ్లు ఎలాంటి అలుపు.. సొలుపు లేకుండా.. వందేళ్లకు పైగా జీవించేవారు. కాని ఇప్పటి యూత్​ రోజుకు  కనీసం రెండు గంటలు కూడా నిద్రపోవడం లేదు.  

మారిన జీవన పరిస్థితుల్లో మంచి నిద్ర కరువైపోయింది. ఆహారపు అలవాట్లు, పనివేళలు నిద్రను దూరం చేస్తున్నాయి. దీని వల్ల మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయి. నిద్ర లేమి ప్రస్తుతం ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. నిద్రలేమితో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.-ఈ సమస్య నుంచి బయట పడటానికి రకరకాల మందులను కూడా వాడుతున్నారు. అయితే నిద్రలేమి సమస్య గురించి పరిశోధకులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. వాటిని పాటిస్తే తప్పకుండా హాయిగా నిద్రపోవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వయస్సుపెరిగే కొద్ది నిద్రలేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. నిద్ర పట్టకపోవడానికి కేవలం నిద్రలేమి సమస్య మాత్రమే కారణం కాకుండా మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే అతి నిద్ర, తక్కువ నిద్ర కూడా రెండు ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో రుజువైంది.

ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. 10 గంటలకన్నా ఎక్కువ నిద్రపోతే అతినిద్ర అని అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. నిద్రలేమి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన 153 అధ్యయనాల్లో వేలమంది పాల్గొన్నారు. ఇందులో చాలా మంది నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయని అన్నారు.

యుక్తవయస్సు వారు రాత్రులు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అది మధుమేహానికి దారితీస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమితో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా నిద్రలేమి రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని దీంతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పడుకునే ముందు: పడుకునే ముందు సులభంగా నిద్ర పట్టాలంటే పుస్తకం చదవడం, స్నానం చేయడం, ధ్యానం చేయడం లాంటివి చేయడం చేయాలి. కాలేజీ, స్కూల్ లో చదువుకునే సమయాల్లో మనకు పుస్తకం తెరవగానే నిద్ర కమ్ముకొచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రావచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి.

ఫోన్ కంప్యూటర్ వాడకం: నిద్రపోయే ముందు కంప్యూటర్, ఫోన్లను ఎక్కువగా ఉపయోగించవద్దు. వాటి నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. పడుకునే కొన్ని నిమిషాల ముందు ఫోన్ లేదా కంప్యూటర్ వాడకూడదు. కొందరు చీకట్లో ఫోన్, కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇది కంటికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా నిద్రను కూడా ఇది దూరం చేస్తుంది.

వ్యాయామం: నిద్రపోయే ముందు బ్రీతింగ్ వ్యాయామం వంటివి చేయడం వల్ల నిద్ర త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి రోజు ఉదయం గంట వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోతుంది. రోజు పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి భోజనం చేయడం వల్ల శరీరం అలసిపోయి త్వరగా నిద్రపడుతుంది.

తియ్యని పదార్ధం: ఒక గ్లాస్ పాలల్లో కాస్త చెక్కర వేసుకొని తాగడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. తీయటి పదార్థాలు నిద్రను ప్రేరేపించేందుకు ఉపకరిస్తాయి. దీంతో నిద్ర త్వరగా పడుతుంది. ప్రతిరోజు చెక్కర తీసుకోవడం కూడా శరీరానికి ఆరోగ్యకరం కాదు అనే విషయాన్ని మాత్రం మరిచిపోవద్దు.